✕
ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకునేందుకు కేంద్రం

x
ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకునేందుకు కేంద్రం ‘యుక్తధార’ (Yuktdhara)అనే కొత్త యాప్ తీసుకువచ్చింది. ఇప్పటి వరకు రాష్ట్రాల ఆధ్వర్యంలో సాగిన పనుల నిర్వహణను ఇకపై కేంద్రమే పర్యవేక్షించనుంది. పనుల ఎంపిక, అంచనాలు, బిల్లుల చెల్లింపుల వరకూ అన్నీ యాప్ ద్వారా నడిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ మార్పుతో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర నామమాత్రంగా మారనుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్లు, కాలువలు, నిర్మాణ పనులపై ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి నివారణ పేరుతో రాష్ట్రాల హక్కులను కేంద్రీకరిస్తుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

ehatv
Next Story