ఆమె చూస్తే చాలా అందంగా ఉంటుంది. కానీ చేసేవన్నీ గబ్బు పనులే. తన భర్తను వదులుకుని మరొకరితో సహజీవనం చేస్తుంది.

ఆమె చూస్తే చాలా అందంగా ఉంటుంది. కానీ చేసేవన్నీ గబ్బు పనులే. తన భర్తను వదులుకుని మరొకరితో సహజీవనం చేస్తుంది. తన 13 ఏళ్ల కూతురుపై తాను ఉంచుకున్న వ్యక్తి, ఇంకా వాడి ఫ్రెండ్స్‌తో కలిసి గ్యాంగ్‌ రేప్‌ చేయించింది. అంతేకాదు ఆ చిన్నారిని మద్యం తాగాలని ప్రోత్సహించింది. పైగా ఆమె బీజేపీ మహిళా అధ్యక్షురాలు. 13 ఏళ్ల కూతురిని.. తన (తల్లి) ప్రియుడు, అతని స్నేహితులతో గ్యాంగ్ రేప్ చేయించిన హరిద్వార్ బీజేపీ మహిళా అధ్యక్షురాలు అనామిక శర్మ(Anamika Sharma). తన భర్తకు విడాకులు ఇచ్చి తన ప్రియుడితో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న అనామిక.

ఈ సంవత్సరం జనవరిలో తన ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి టూర్ కి వెళ్లిన అనామిక ఆమె 13 ఏళ్ల కూతురు. ఈ సమయంలో తన ప్రియుడు మరియు అతని స్నేహితులతో కలిసి తన కూతురిని గ్యాంగ్ రేప్ చేయడానికి అనామిక సహకరించింది. వివరాల్లోకి వెళ్తే..

హరిద్వార్‌(Haridwar)లో జరిగిన ఈ ఘటనలో అనామిక శర్మ, ఆమె ప్రియుడు సుమిత్ పట్వాల్(Sumit Patwal), అతని స్నేహితుడు శుభం కలిసి కూతురును గ్యాంగ్‌ రేప్‌ చేయించారు. అనామిక శర్మ బీజేపీ మహిళా మోర్చా(BJP Mahila Morcha) హరిద్వార్ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసింది. తన 13 ఏళ్ల కూతురిపై జనవరి నుండి మార్చి మధ్య హరిద్వార్, ఆగ్రా, వృందావన్‌లలో బహుసార్లు గ్యాంగ్ రేప్ జరిగేలా సహకరించింది. ఈ దారుణం ఆమె సమక్షంలో జరిగినట్లు, బాధితురాలిని మద్యం సేవించేలా బలవంతం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన బాధితురాలు తన తండ్రికి చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. తండ్రి ఫిర్యాదు మేరకు రాణిపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అనామిక శర్మ, సుమిత్ పట్వాల్‌ను ఓ హోటల్‌లో అరెస్ట్ చేశారు. శుభం అనే మూడో వ్యక్తిని కూడా మీరట్‌లోని షాపూర్ నుండి అరెస్ట్ చేశారు. నిందితులపై పోక్సో కేసు నమోదైంది.

Updated On 6 Jun 2025 4:48 AM GMT
ehatv

ehatv

Next Story