ప్రియుడితో సాన్నిహిత్యంగా ఉండే వీడియో పంపిన భార్య..తట్టుకోలేక భర్త చేసుకున్నాడు.

ప్రియుడితో సాన్నిహిత్యంగా ఉండే వీడియో పంపిన భార్య..తట్టుకోలేక భర్త చేసుకున్నాడు. మగవారి రక్షణకు కూడా చట్టాలు తీసుకురండి అంటూ ఆత్మహత్యకు ముందు వీడియో రికార్డు చేసిన బాధితుడు. హర్యానా రాష్ట్రం రోహ్తక్ ప్రాంతానికి చెందిన మగన్ అలియాస్ అజయ్ (Ajay)ఆమె వ్యక్తి, తన భార్య ఆమె ప్రియుడి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య దివ్య, పోలీస్ అధికారి దీపక్ (Deepak)అనే వ్యక్తితో సాన్నిహిత్యంగా ఉన్న వీడియో పంపించి వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు. దివ్య(Divya) ఆమె ప్రియుడు దీపక్ ఇద్దరు కలిసి నా తండ్రిని హత్య చేసి, ఆస్తి అమ్మి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని, కన్న తండ్రిని ఎలా చంపాలంటూ బాధితుడు కన్నీరు పెట్టుకున్నాడు. ఇటీవల తన బ్రేస్ లెట్, సాగు చేసిన ధాన్యం అమ్మి రూ.3.5 లక్షలు ఇచ్చానని, మరో రూ 1.5 లక్షలు డిమాండ్ చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. లాయర్ ను కలిస్తే అమ్మాయిల పట్ల కనికరం ఉంటుందని, ఆమె ఒకసారి ఏడుస్తే ఎవరైనా క్షమిస్తారని చెప్పడంతో, మగవారిని కాపాడడానికి కూడా చట్టాలు తీసుకురావాలని సెల్ఫీ వీడియోలో పేర్కొన్న బాధితుడు. తను చనిపోయిన తరువాత తన కొడుకు తన తల్లిదండ్రుల వద్దే ఉండాలని కోరుతూ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాధితుడు మగన్

ehatv

ehatv

Next Story