మహిళల్లో క్రూరత్వం పెరుగుతోందని చెప్పడానికి ఈ ఘటనే కారణం. భార్యలు భర్తలను హతమారుస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.

మహిళల్లో క్రూరత్వం పెరుగుతోందని చెప్పడానికి ఈ ఘటనే కారణం. భార్యలు భర్తలను హతమారుస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా కర్ణాటకలోని విజయపుర జిల్లాకు చెందిన ఒక మహిళ భర్తను హతమార్చడానికి ప్రయత్నించింది. ప్రియుడి కోసం భర్త మర్మాంగాలపైన దాడి చేసి చంపేందుకు యత్నం చేసింది. పరాయి మగాడి పడక సుఖానికి అలవాటు పడిన మహిళ భర్తను అంతమొందించేందుకు ప్లాన్ వేసింది. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న ట్విస్ట్‌తో ఈ క్రైం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా ఇండి అక్కమహాదేవి కాలనీలో బీరప్ప పూజారి, సునంద దంపతులు జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే సునంద సిద్ధప్ప అనే వ్యక్తితో పరిచయాన్ని ఏర్పరచుకొని వివాహేతర సంబంధం పెట్టుకుంది. సిద్ధప్పతో పడక సుఖానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, అతడిని అంతమొందించాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఓ రోజు బీరప్ప రాత్రివేళ నిద్రపోతున్న క్రమంలో సునంద భర్త గొంతు నులిమి అతని మర్మాంగాలపైన దాడి చేసి చంపేందుకు ప్రయత్నించింది. భర్తను హతమార్చడానికి ప్రయత్నిస్తున్న సునందకు ప్రియుడు సిద్ధప్ప కూడా సాయం చేశాడు.
బీరప్ప మేలుకొని కాళ్లతో ఎయిర్ కూలర్ని గట్టిగా తన్నుతూ, కేకలు వేశాడు. వీరి మధ్య జరుగుతున్న కొట్లాటను గమనించిన ఇంటి యజమాని దంపతులు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. దీంతో పాటు బీరప్ప ఎనిమిదేళ్ల కుమారుడు కూడా తలుపులు తీయడంతో సునంద చేసిన దారుణం బయటకు వచ్చింది. భార్య, ప్రియుడి ప్లాన్ అడ్డం తిరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా భార్య, ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.
