Leader's Duaghters: షర్మిల, కవిత, రోహిణి.. సోదరులతో వీళ్ల లొల్లి ఏంటి..!
Leader's Daughters: Sharmila, Kavitha, Rohini.. What's their relationship like with their brothers..!
రాజకీయాల్లో అవకాశాల కోసం ఆడబిడ్డల పోరు పొలిటికల్ ఫ్యామిలీలలో చిచ్చు పెడుతోంది. ఏపీలో జగన్ సోదరి షర్మిల, తెలంగాణలో KTR చెల్లెలు కవిత బాటలోనే, బిహార్‌లో తేజస్వి సోదరి రోహిణి తమ బంధాలను తెంచుకున్నారు. ఇంటి పోరుతో ఆయా పార్టీలు కుదేలవుతున్నాయి. ఎన్నికలకు ముందు షర్మిల వేరుకుంపటి పెట్టుకోగా, ఎన్నికల తర్వాత కవిత, రోహిణి తమ బాధను వెళ్లగక్కారు.
రాజకీయాల్లో కుటుంబ గొడవలు కొత్తవి కావు, కానీ ఇటీవలి కొన్ని సంఘటనలు భారతదేశంలోని ప్రధాన పార్టీల్లోని కుటుంబాల్లో చిచ్చులు వచ్చాయి. ఆంధ్రప్రదేష్‌లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, అతని సోదరి వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ APCC అధ్యక్షురాలు మధ్య గొడవ, తెలంగాణలో కల్వకుంట్ల కవిత, ఆమె సోదరుడు కె.టి. రామారావు మధ్య ఘర్షణ, బీహార్‌లో రోహిణి ఆచార్య, ఆమె సోదరుడు తేజస్వి యాదవ్ మధ్య పోరు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఈ గొడవలు పార్టీలను కుదేలు చేస్తున్నాయా? ఈ వివాదాలకు ముగింపు దొరుకుతుందా?
2019 ఎన్నికల ముందు షర్మిల తన సోదరుడు జగన్‌కు మద్దతుగా నిలిచింది. కానీ 2021లో తెలంగాణలో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని ప్రారంభించింది. ఆ తర్వాత జగన్‌తో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. 2024 ఎన్నికల ముందు ఆమె YSRTPను కాంగ్రెస్‌లో లీచ్ చేసి, APCC అధ్యక్షురాలుగా నియమితులయ్యింది. ఎన్నికల తర్వాత, కుటుంబ ఆస్తులు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్లు, భూములు, కంపెనీలపై గొడవ మరింత తీవ్రమైంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఆస్తుల తగాదాలు కూడా మొదలయ్యాయి.
తెలంగాణలో కవిత vs కేటీఆర్. ఉద్యమకాలం నుంచి కవిత, కేటీఆర్ కలిసి పనిచేశారు. 2023 ఎన్నికల్లో BRS అధికారం కోల్పోయిన తర్వాత, కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చింది. ఆమె బయటకు వచ్చిన తర్వాత, పార్టీలో 'సక్సెషన్ వార్' మొదలైంది. 2025 మేలో కవిత, కేటీఆర్, హరీష్‌రావుపై గళమెత్తింది. పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారు, నేను జైలులో ఉన్నప్పుడు ఇది జరిగింది" అని ఆమె ఆరోపించింది. అంతకు ముందు ఆమె తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లెటర్ లీక్ అయ్యింది. పార్టీ సినియర్లు హరీష్‌రావుపై తీవ్ర ఆరోపణలు చేసింది. హరీష్‌రావు అవినీతి వల్లే కేసీఆర్‌కు ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించింది. సెప్టెంబర్ 2025లో KCR కవితను BRS నుంచి సస్పెండ్ చేశాడు. జూబ్లీహిల్స్ బై-ఎలక్షన్ ఓటమి తర్వాత కవిత మరోసారి కేటీఆర్, హరీష్ రావులపై విమర్శలు చేసింది. కర్మ హిట్ బ్యాక్ అంటూ వేసిన ట్వీట్‌పై బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా పరిగణించి, కవితపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు.
బీహార్‌లో రోహిణి vs తేజస్వి. రోహిణి 2022లో తండ్రి లాలూ యాదవ్‌కు కిడ్నీ డొనేట్ చేసింది. RJDలో చేరి 2024 లోక్‌సభల్లో సారణ నుంచి పోటీ చేసి ఓడిపోయింది. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ మాత్రం 25 సీట్లకు పరిమితమైంది. ఓటమి తర్వాత రివ్యూ మీటింగ్‌లో తేజస్వి రోహిణిని దూషించాడు, చెప్పుతో కొట్టాలని ప్రయత్నించాడని ఆరోపించింది. ఈ అన్నాచెల్లెళ్ల వివాదాలకు తెర పడతుందా, ఇలాగే కొనసాగుతుందా అనేది కాలమే సమాధానం ఇస్తుంది.