ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గుజైనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రామ్‌గోపాల్ చౌరాహా వద్ద ఈ ఘటన జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గుజైనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రామ్‌గోపాల్ చౌరాహా వద్ద ఈ ఘటన జరిగింది. రోహిత్, అతని స్నేహితురాలు రోడ్డు పక్కన ఒక స్టాల్ తింటుండగా అది చూసిన తల్లిదండ్రులు రెచ్చిపోయారు. వీరి ప్రేమను ఒప్పుకోని రోహిత్‌ తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహంతో వారిపై దాడి చేశారు. రోహిత్‌ తల్లి సుశీల రోహిత్‌ను, అతని స్నేహితురాలిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. అతని ప్రియురాలిని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. రోహిత్‌ను చెప్పుతో తండ్రి శివకరణ్‌ చితకబాదాడు. వీడియోలో సుశీల యువ జంటను కొడుతూ, వారు టూ-వీలర్‌పై ఎస్కేప్ కావడానికి ప్రయత్నిస్తుండగా ఆమె స్నేహితురాలి జుట్టు పట్టుకుని లాగారు. స్థానికులు, రోడ్డుపై ఉన్నవారు ఈ ఘటనను చూస్తూ, కొందరు జోక్యం చేసుకొని వారిని విడదీయడానికి ప్రయత్నించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరు పక్షాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. రోహిత్, అతని స్నేహితురాలు రామ్‌గోపాల్ చౌరాహా సమీపంలోని అనధికార స్టాల్స్ వద్ద తరచూ కలుస్తుండేవారు, ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని వారిపై దాడికి పాల్పడ్డారు.

ehatv

ehatv

Next Story