Mumbai: నో పార్కింగ్.. నో కార్..! ముంబైలో కొత్త రూల్..!
Mumbai: నో పార్కింగ్.. నో కార్..! ముంబైలో కొత్త రూల్..!
సాధారణంగా కారు కొనాలనుకుంటే మనం దానికి పార్కింగ్ ప్లేస్ ఉందా లేదా అనేది చూడకుండా కొనేస్తాం. తీరా కొన్న తర్వాత ఎక్కడో ఒక చోట రోడ్డుపై పార్కింగ్ చేస్తుంటాం. సొంతింటివారు, అపార్టెమెంట్లో అయితే కారు పార్కింగ్‌కు ప్లేస్ ఉంటుంది. కానీ అద్దెకు ఉన్నవారికి పార్కింగ్ సౌకర్యం ఉండదు.దీంతో రోడ్లు సాఫీగా ఉండాలి, ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలి, అత్యవసర వాహనాలకు దారి ఇవ్వాలి. కారు ఆపితే ఇబ్బంది అవుతుందని ముంబైలో కొత్త రూల్ తీసుకొచ్చారు. ముంబైలో కొత్త కారు కొనాలంటే ఇప్పుడు "నో పార్కింగ్, నో కార్" అనే కొత్త నియమం అమలులోకి వచ్చింది. ఈ రూల్ ప్రకారం, కొత్త వాహనం రిజిస్ట్రేషన్ చేయించే ముందు పార్కింగ్ స్పేస్ ఉన్నట్లు సంబంధిత అధికారుల నుంచి పార్కింగ్ స్పేస్ ప్రూఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ నియమం ముంబై, పుణె, నాగ్‌పూర్‌తో సహా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) పరిధిలో అమలవుతుంది. దీని ఉద్దేశం ట్రాఫిక్ రద్దీ, అనధికార పార్కింగ్‌ను అరికట్టడం, అత్యవసర సేవలకు అడ్డంకులు తొలగించడం. అయితే, ఈ నియమం వల్ల పాత నివాస ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం లేని వారికి ఇబ్బందులు ఎదురుకావొచ్చని కొంతమంది విమర్శిస్తున్నారు.