1990 ఆగస్టులో పిపి సింగ్ సంకీర్ణ ప్రభుత్వం ఓబిసి 27% రిజర్వేషన్ ప్రకటించినప్పుడు రెండు సంవత్సరాల స్టే విధించబడి ఆయన ప్రభుత్వం పడిపోయిన తర్వాత నవంబర్ 1992లో స్టే తొలగించబడి అమలు చేయబడింది.

1990 ఆగస్టులో పిపి సింగ్ సంకీర్ణ ప్రభుత్వం ఓబిసి 27% రిజర్వేషన్ ప్రకటించినప్పుడు రెండు సంవత్సరాల స్టే విధించబడి ఆయన ప్రభుత్వం పడిపోయిన తర్వాత నవంబర్ 1992లో స్టే తొలగించబడి అమలు చేయబడింది. 1979లో బీహార్లో కర్పూరీ ఠాగూర్ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ పెంపు నేపథ్యంలో అది అమలు నోచుకోకుండానే ఆయన ప్రభుత్వం పడిపోయింది.
ఇదే బీహార్‌లో 2023 లో నితీష్ కుమార్ కులగణన కూడా "స్టే" గురి అయ్యి ఆగిపోయింది. స్టే తొలగించుకొని కులగణ పూర్తి చేసి దాని అమలును ప్రారంభించగా మళ్ళి స్టే విధించబడి ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు.
2019 జనవరిలో 10 శాతం EWS రిజర్వేషన్ కొరకు రెండే రోజుల్లో రాజ్యాంగాన్ని సవరించారు. దీనికి దేశంలోని ప్రధాన పార్టీలన్నీ మద్దతు తెలిపాయి.
08-01-2019 న లోకసభ, 09-01-2019 న రాజ్యసభ, 12-01-2019 న రాష్ట్రపతి ఆమోదం 14-01-2019న గుజరాత్ రాష్ట్రంతో మొదలై దేశవ్యాప్తంగా అమలు అవుతున్నవి. ఆర్థిక ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చెల్లదు అని 1992 నవంబర్ లో చెప్పిన సుప్రీంకోర్టు, 2022 నవంబర్‌లో మాత్రం ( రాజ్యాంగ సవరణతో పంపిన ) EWSరిజర్వేషన్ చెల్లుతుందని తీర్పు ఇచ్చింది.
