ఓ మహిళ తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని గుర్తించింది. ఈ విషయం తెలుసుకున్న భార్య అతడి పరువు తీయాలని భావించింది.

ఓ మహిళ తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని గుర్తించింది. ఈ విషయం తెలుసుకున్న భార్య అతడి పరువు తీయాలని భావించింది. ఆమె ఒక బోర్డు తయారు చేసి, దానిపై “నేను రెండు సంవత్సరాలు వివాహేతర సంబంధం కొనసాగించాను” అని రాసి, ఆ బోర్డును భర్త మెడలో వేలాడదీసింది. ఆ తర్వాత అతడిని ఊరి వీధుల్లో నడిపించింది. కాన్పూర్‌లోని ఈ ఘటన జరిగింది. ఈ ఘటనను కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలొ షేర్ చేశారు. వీడియోలో భర్త బోర్డుతో నడుస్తూ, జనం గుమిగూడి చూస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. కొందరు మహిళలు, పురుషులు ఈ చర్యను సమర్థించారు. వివాహేతర సంబంధాలు భాగస్వామిని మోసం చేయడమేనని, ఇలాంటి బహిరంగ శిక్షలు ఇతరులకు గుణపాఠంగా ఉంటాయని వాదించారు. ముఖ్యంగా, మహిళా హక్కుల కోసం పనిచేసే కొన్ని సంస్థలు ఈ మహిళ ధైర్యాన్ని ప్రశంసించాయి. మరికొందరు ఈ చర్యను “బహిరంగ అవమానం”గా విమర్శించారు. ఇలాంటి చర్యలు చట్టవిరుద్ధమని, వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. కొందరు ఈ ఘటనను హాస్యాస్పదంగా తీసుకున్నారు, కానీ వివాహేతర సంబంధాల విషయంలో ఇలాంటి సమస్యలను కుటుంబంలో లేదా చట్టపరంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

ehatv

ehatv

Next Story