Ind vs Nz: విశాఖ వన్డేలో శ్రేయాస్ అయ్యర్‌ను తీసుకోకపోవడానికి కారణం.. ! గంభీర్‌తో కోల్డ్వారేనా..!

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వచ్చాక పలు వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. గంభీర్-కోహ్లీ, గంభీర్-రోహిత్ మధ్య విబేధాలు గతంలో నడిచాయి. అయితే తాజాగా శ్రేయాస్ అయ్యర్‌ను నాలుగో వన్డేలో ఆడనివ్వకపోవడం, ఇద్దరి మధ్య సఖ్యత లేదన్న కారణంగానే అతడిని తుదిజట్టులోకి తీసుకోలేదన్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. శ్రేయస్ అయ్యర్‌పై గౌతమ్ గంభీర్ అసంతృప్తిగా ఉన్నాడని.. ఇద్దరి మధ్య సంత్సంబంధాలు సరిగా లేవని చర్చించుకుంటున్నారు. న్యూజిలాండ్‌తో నాలుగో టీ20లో ఇషాన్ కిషన్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను తీసుకోవాల్సింది. కానీ ఆ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులో ఫైనల్ చేశారు. అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంపిక చేయడం వెనుక అంతర్గత కారణాలున్నాయన్న వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. గంభీర్ హయాంలో శ్రేయస్‌కు సరైన అవకాశాలు ఇవ్వడం లేదన్న భావన సోషల్ మీడియాలో చర్చకు వస్తోంది. సూర్యకుమార్ యాదవ్‌ను కూడా గంభీర్ ప్రభావితం చేస్తున్నాడని, జట్టులో జరిగే నిర్ణయాలన్నింటినీ గంభీరే నడిపిస్తున్నాడన్న చర్చ కూడా ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేకు శ్రేయాస్ అయ్యర్‌ను తీసుకోకపోవడానికి కారణం గంభీర్-శ్రేయస్ మధ్య కోల్డ్ వారే అని ప్రచారం జరుగుతోంది.


