ICC Women's Cricket World Cup 2025 : ఉమెన్స్ కప్‌లో కడప క్రికెటర్ కీలక రోల్..!
భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే.

భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్లో కడపకు చెందిన శ్రీ చరణి అద్భుత ప్రదర్శనతో టీమ్ ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. మొత్తం 9 మ్యాచుల్లో 14 వికెట్లు తీసి అత్యధిక వికెట్స్ తీసిన నాలుగో బౌలర్‌గా నిలిచారు. తొలిస్థానంలో ఉన్న దీప్తీ శర్మ(22) తర్వాత ఇండియా నుంచి శ్రీ చరణి మాత్రమే టాప్ 10లో చోటు దక్కించుకోవడం విశేషం.
ఎనిమిదేళ్ల క్రితం... వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 229 పరుగుల లక్ష్య ఛేదనలో చివర్లో తడబడిన భారత మహిళలు 9 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆఖరి 3 ఓవర్లలో 3 వికెట్లతో 14 పరుగుల చేయాల్సిన స్థితిలో అంత చేరువగా వచ్చి ఓడటం అందరినీ వేదనకు గురి చేసింది. అయితే 2017 వరల్డ్ కప్ ప్రదర్శన గతంతో పోలిస్తే మహిళల జట్టుకు ఎంతో మేలు చేసింది. అన్ని వైపుల ఆసక్తి కనిపించడంతో పాటు టీమ్ స్థాయి కూడా పెరిగింది.


