Uttar Pradesh : డ్రీమ్ 11లో 39 రూపాయల పెట్టుబడి.. రూ.4 కోట్లు ఖాతాలోకి..!
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాకు చెందిన మంగల్ సరోజ్ అనే వ్యక్తి డ్రీమ్ 11లో కేవలం 39 రూపాయలు పెట్టుబడి పెట్టి 4 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు.

ఉత్తరప్రదేశ్(UP)లోని కౌశాంబి జిల్లాకు చెందిన మంగల్ సరోజ్ అనే వ్యక్తి డ్రీమ్ 11లో కేవలం 39 రూపాయలు పెట్టుబడి పెట్టి 4 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంగల్ సరోజ్(Mangal Saroj), ఒక రైతు కొడుకు, మార్చి నుంచి డ్రీమ్ 11లో 49 రూపాయలు పెట్టుబడి పెడుతూ ఆడుతున్నాడు, కానీ ప్రతి గేమ్‌లో ఓడిపోతూ వచ్చాడు. ఏప్రిల్ 30, 2025న చెన్నై సూపర్ కింగ్స్(CSK) మరియు పంజాబ్ కింగ్స్(PBKS) మధ్య జరిగిన IPL మ్యాచ్‌లో అతని ఖాతాలో 39 రూపాయలు మాత్రమే ఉండగా, ఆ డబ్బుతో టీమ్‌ని సెట్ చేసి 4 కోట్ల రూపాయల జాక్‌పాట్ గెలిచాడు. దీంతో అతని గ్రామంలో సరాయ్ అకిల్ థానా పరిధిలోని ఘాసీ రామ్ కే పుర్వాలో జోష్ వచ్చింది. కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. స్థానికులు, స్నేహితులు అతన్ని అభినందిస్తున్నారు. అయితే, కొందరు ఈ గెలుపు యువతను జూదం వైపు ఆకర్షించవచ్చని, ఇది ఆందోళన చెందే అంశమని అంటున్నారు.
