హైదరాబాద్​లోని మధురానగర్ ఓ యువకుడి మర్మాంగాలను కుక్క కొరకడంతో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు.

హైదరాబాద్​లోని మధురానగర్ ఓ యువకుడి మర్మాంగాలను కుక్క కొరకడంతో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. అనారోగ్యంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న అతడు గుండెపోటుతో చనిపోయాడని అనుకుంటుండగా, అతడి మర్మాంగాలను అతడి పెంపుడు కుక్క(Pet Dog Attack) కరిచిన ఆనవాళ్లు కనిపించాయి. అయితే, పోస్ట్​మార్టం రిపోర్ట్​ వచ్చిన తర్వాతే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh)లోని కృష్ణా జిల్లా గుడివాడ(Gudiwada)కు చెందిన పవన్ కుమార్(Pawan Kumar) (35) నగరంలోని ఓ జ్యువెలరీ దుకాణంలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. మధురానగర్(Madhura nagar) ఈ బ్లాక్‌లో ఉంటున్నాడు. ఇతడు సైబీరియన్​ హస్కీ (Siberian Husky)జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు. భార్యతో మనస్పర్థలు రావడంతో ఆమెకు ఐదేళ్ల క్రితం విడాకులు ఇచ్చాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం పవన్ స్నేహితుడు సందీప్ (Sandeep)ఇంటికి వచ్చి తలుపు కొట్టగా ఎంతకూ తెరవలేదు.

ఎన్నిసార్లు తలుపు కొట్టినా తీయకపోవడంతో ఇరుగు చుట్టుపక్కలవారి సాయంతో తలుపులను పగులగొట్టాడు. లోపలకు వెళ్లి చూడగా అప్పటికే పవన్​ చనిపోయి ఉన్నాడు. పవన్​ మర్మాంగాల వద్ద కుక్క కొరికిన ఆనవాళ్లు కనిపించాయి. పక్కనే ఉన్న కుక్క నోటికి రక్తపు మరకలు కనిపించాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. క్లూస్​టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. డెడ్​బాడీని పోస్ట్​మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనారోగ్యంతో ఉన్న పవన్.. గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని, ఎంతకీ పవన్ లేవకపోవడంతో యజమానిని లేపడానికి పెంపుడు కుక్క అతడి మర్మాంగాల్ని కొరికి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్​ వస్తే గానీ ఏమీ చెప్పలేమని ఎస్సై శివ శంకర్ తెలిపారు. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story