A tragic incident in Hyderabad: హైదరాబాద్‌లో విషాద ఘటన.. రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చర్లపల్లి–ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. చర్లపల్లి- ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ మధ్య ఈరోజు తెల్లవారుజామున 2:30 గంటల సమయానికి, రైల్వే ట్రాక్‌పై మృతదేహాలను చూసి వాకీటాకీ ద్వారా సమాచారమిచ్చిన గూడ్స్ రైలు లోకోపైలట్. ఘటనా స్థలానికి చేరుకుని మృతులు బోడుప్పల్ ప్రాంతానికి చెందిన పిన్నింటి విజయశాంతి(38), విశాల్ రెడ్డి, చేతన రెడ్డిలుగా గుర్తించిన పోలీసులు. విజయశాంతి తన కూతురు చేతన(ఇంటర్ సెకండ్ ఇయర్), కొడుకు విశాల్ రెడ్డి(ఇంటర్ ఫస్ట్ ఇయర్)లతో కలిసి ఉంటుందని, ఆమె భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులో ఉంటున్నాడని పోలీసుల నిర్ధారణ. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు


