లేడీ అఘోరిగా తిరుగుతున్న శ్రీనివాస్‌పై కరీంనగర్‌లో మరో రేప్ కేసు నమోదైంది.

లేడీ అఘోరిగా తిరుగుతున్న శ్రీనివాస్‌పై కరీంనగర్‌లో మరో రేప్ కేసు నమోదైంది. కొత్తపల్లి(Kothapalli)కి చెందిన యువతి ఫిర్యాదు మేరకు, శ్రీనివాస్(Srinivas) తనను బెదిరించి, బలవంతంగా ప్రైవేట్ పార్ట్స్‌పై చేతులు వేసి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించింది. కొండగట్టులో తాళి కట్టి అత్యాచార యత్నం చేసినట్లు, రూ.3 లక్షలు వసూలు చేసినట్లు , ఫిర్యాదు విషయాన్ని బయటపెడితే చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు తెలిపింది.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐపీసీ సెక్షన్లు 64(1), 87, 318(4), 351(2) కింద కేసు నమోదు చేశారు. శ్రీనివాస్‌ను విచారించనున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్, అతని భార్య వర్షిణితో సహా ఇతర కేసుల్లో రిమాండ్‌లో ఉన్నారు.
గతంలో రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలానికి చెందిన మహిళా ప్రొడ్యూసర్ కూడా శ్రీనివాస్‌పై మోసం కేసు పెట్టింది. ఆరు నెలల క్రితం ప్రొద్దటూరులోని ప్రగతి రిసార్ట్స్‌లో డిన్నర్ సందర్భంగా శ్రీనివాస్ ఆమెకు పరిచయమైంది. సనాతన ధర్మం, క్షుద్ర పూజల పేరుతో మాయమాటలు చెప్పి, రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా, మరో రూ.5 లక్షలు ఉజ్జయినిలోని ఫామ్‌హౌస్‌లో పూజల కోసం వసూలు చేసింది. పూజ విఫలమైతే కుటుంబం నాశనమవుతుందని బెదిరించి మొత్తం రూ.10 లక్షలు కాజేసింది. ఈ మోసం కేసులో శ్రీనివాస్‌ను, వర్షిణిని పోలీసులు అరెస్ట్ చేశారు.
