నగరంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా నేడు జరగాల్సిన బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది.

నగరంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా నేడు జరగాల్సిన బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 28వ తేదీన ఆదివారం సాయంత్రం ఈ కార్యక్రమం ఉంటుందని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొననున్న మహిళలు, ప్రజలు వర్షం వల్ల ఇబ్బందులు పడకూడదని నేటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిందని తెలిపారు. ఈనెల 28వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ కుంటను ప్రారంభించి నగర ప్రజలకు అంకితం చేస్తారని కమిషనర్ పేర్కొన్నారు.

Updated On
ehatv

ehatv

Next Story