నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం జలాల్పూర్ గ్రామంలో నకిలీ నోట్ల కలకలం రేగింది.

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం జలాల్పూర్ గ్రామంలో నకిలీ నోట్ల కలకలం రేగింది. ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో ఓ కాంగ్రెస్ అభ్యర్థి 500 రూపాయల దొంగనోట్లు పంచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.స్థానిక వివరాల ప్రకారం ఎన్నికల సమయంలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఓటర్లకు నకిలీ నోట్లు పంచినట్టు సమాచారం. ఆ నోట్లలో కొన్నింటితో ఓ రైతు కెనరా బ్యాంక్‌కి వెళ్లి క్రాప్ లోన్ వడ్డీ చెల్లించేందుకు ప్రయత్నించాడు. బ్యాంక్ అధికారులు ఆ నోట్లు దొంగనోట్లు అని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.రైతును విచారించిన తరువాత ఈ వ్యవహారం బహిర్గతమైంది. అయితే, సంబంధిత కాంగ్రెస్ అభ్యర్థి అదే గ్రామంలో సర్పంచ్‌గా గెలిచినట్లు సమాచారం. ఆ అభ్యర్థి బాన్సువాడ మాజీ మంత్రివర్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరుడుగా చెప్పబడుతున్నారు. ఈ ఘటన బయటకి రాకుండా కొందరు స్థానిక నేతలు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


