ప్రియాంకాగాంధీ భర్త, తన బావ రాబర్ట్ వాద్రాపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలు చేయడంపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పోస్టు చేసిన ట్వీట్ విషయం తెలంగాణకు పాకింది.

ప్రియాంకాగాంధీ భర్త, తన బావ రాబర్ట్ వాద్రాపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలు చేయడంపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పోస్టు చేసిన ట్వీట్ విషయం తెలంగాణకు పాకింది. రాహుల్‌గాంధీకి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. కౌంటర్‌లో భాగంగా ''ఇది మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యవహారం కావడంతో దీనిపై మీరు స్పందిస్తున్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతీకార రాజకీయాలు, అబద్ధాలతో కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తే మాత్రం మీరు మౌనంగా ఉంటున్నారు. ఇంది వంచనకు పరాకాష్ట'' కాదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ట్వీట్ కు ఎక్స్ వేదికగా స్పందించిన హరీశ్ రావు పై విధంగా రియాక్ట్ అయ్యారు. కాగా వాబర్ట్ వాద్రాపై ఈడీ చార్జిషీట్ దాఖలుపై ఇవాళ ఎక్స్ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తన బావను వెంటాడుతోందని ఆయన ట్వీట్‌లో రాసుకొచ్చారు. తాజాగా నమోదైన చార్జీషీటు కూడా ఆ కోవకు చెందినదేనని విమర్శించారు. దురుద్దేశం, రాజకీయ కక్షతో పెట్టిన ఈ కేసును ఎదుర్కొనేందుకు రాబర్ట్ వాద్రా, ప్రియాంకాల కుటుంబానికి తాను అండగా ఉంటానని నిజం ఎప్పటికైనా బయటపడుతుందని ఆయన ట్వీట్ చేశారు.
