High Court shocks private colleges: ప్రైవేట్‌ కాలేజీలకు హైకోర్టు షాక్..! బకాయిలు ఎందుకు ఇయ్యలేదని సర్కార్‌కు ప్రశ్న..!

సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫీజు చెల్లించని కారణంగా సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పలు సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ విచారిస్తూ ఫీజు చెల్లించని కారణంగా సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని, కాలేజీల నుండి వేధింపులకు గురవుతున్న విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పట్ల ఉన్న బకాయిలపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్

Updated On
ehatv

ehatv

Next Story