లంచం ఎంత తీసుకుంటారు?. వేల నుంచి లక్షల్లోకి వెళ్తే అబ్బో అనుకుంటాం. కానీ ఒకటి కాదు..రెండు కదాదు ఎకంగా 70 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడో ఆఫీసర్.

లంచం ఎంత తీసుకుంటారు?. వేల నుంచి లక్షల్లోకి వెళ్తే అబ్బో అనుకుంటాం. కానీ ఒకటి కాదు..రెండు కదాదు ఎకంగా 70 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడో ఆఫీసర్. ఇండియన్ రెవిన్యూ సర్వీస్‌కు చెందిన జీవన్‌లాల్ (Jeevan Lal)హైదరాబాద్(Hyderabad)లోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఎక్సెమ్షన్ కమిషనర్‌గా పనిచేస్తున్నాడు. ఒక వ్యాపారవేత్త నుంచి, అతని సంస్థకు సంబంధించిన పన్ను సంబంధిత సమస్యలను సెటిల్ చేయడానికి లంచం సెటిల్ చేసుకున్నాడు. ఏకంగా 70 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. సీబీఐకి సమాచారం అందడంతో వారు ట్రాప్ చేశారు. జీవన్ లాల్ లంచం తీసుకుంటున్న సమయంలో అరెస్టు చేశారు. జీవన్ లాల్ తండ్రి రాములు నాయక్(Ramulu nayak), తెలంగాణ(Telangana)లోని వైరా నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో పోటీ చేసి గెలిచారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. గత ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ రాలేదు. ఆయన కుమారుడు జీవన్ లాల్. సీబీఐ(CBI) అరెస్టు చేసి అతని ఇంటిలో, కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. లంచం డబ్బుతో పాటు కొన్ని ఆస్తుల సంబంధిత డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. జీవన్ లాల్‌ను కోర్టులో హాజరుపరిచి, సీబీఐ కస్టడీకి తీసుకున్నారు. జీవన్ లాల్ భార్య ఐపీఎస్ అధికారి.
