సుమారు 9300 ఎకరాలు, దాదాపు 4 నుంచి 5 లక్షల కోట్ల విలువైన భూకుంభకోణానికి తెరలేపిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

సుమారు 9300 ఎకరాలు, దాదాపు 4 నుంచి 5 లక్షల కోట్ల విలువైన భూకుంభకోణానికి తెరలేపిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఒకటి కాదు రెండు కాదు హైదరాబాద్‌లో చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయని.. ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, పక్కనే బాలానగర్ కూకట్పల్లి జీడిమెట్ల నాచారం మల్లాపూర్ ఇంకా చాలా ఉన్నాయి. పారిశ్రామికవాడలు హైదరాబాద్‌లో చాలా ఉన్నాయన్నారు. ఇవ్వాళ మార్కెట్లో చూసినట్లయితే అక్కడ ఎకరం 40-50 కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదని.. గజం లెక్కన చూస్తే రెండు లక్షలు, లక్ష లక్షన్నర ఉంటదన్నారు. అలాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాదులో అంటే ఇక్కడ మీరు సగటున 40 కోట్లు వేసుకున్నా కానీ దాని విలువ నాలుగు లక్షల కోట్లు ఉంటుందన్నారు. ఎకరానికి 50 కోట్లు వేసుకున్నా సగటున దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని ఆయన అనుయాయులకు, అనుచరులకు, బంధువులకు, ఆయన బామ్మర్దులకు ఆయన తమ్ముళ్లకు ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక అతి పెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో తెరలేపింది.

గత ప్రభుత్వాలకు ఇండస్ట్రీల కోసమని కేటాయించిన భూములను రెగ్యులరైజ్‌ చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. మా ప్రభుత్వంలో రిజస్ట్రేషన్‌ విలువలో 100కు 100 శాతం కట్టాలని, ఓనర్షిప్‌ మారితే 200 శాతం రిజిస్ట్రేషన్‌ కట్టాలని అసెంబ్లీలో చట్టం చేశామని, కానీ ఈ ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ విలువలో కేవలం 30 శాతం కడితే వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని చూస్తోందన్నారు. ఆ మేరకు ఆయా యాజమాన్యాలతో రేవంత్‌రెడ్డి బంధువులు, తమ్ముళ్లు, ఆయన వెంట ఉండే ముఠా ఒప్పందాలు కుదుర్చుకొని రిజిస్ట్రేషన్‌ విలువలో కేవలం 30 శాతం కట్టి ఆ భూములను కొల్లగొట్టాలని చూస్తున్నారన్నారు. భూములను వెనక్కి తీసుకోవాలని, లేదా 50 శాతమైనా వెనక్కి తీసుకొని ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. లేదా ఆ భూములను వేలం వేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా అని ప్రశ్నించారు KTR. దీనిపై చట్టపరంగా కూడా వెళ్తామని, ఈ భూములను రెగ్యులరైజ్‌ చేస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు.

Updated On
ehatv

ehatv

Next Story