హైదరాబాద్‌లో 72వ మిస్‌ వరల్డ్‌ పోటీసులు ఈ నెల 10 నుంచి 31 వరకు జరగాల్సి ఉంది. భారత్‌- పాకిస్తాన్‌(India-pakistan) మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇక్కడ నిర్వహించాల్సిన అందాల పోటీలపై సందిగ్ధత నెలకొంది.

హైదరాబాద్‌లో 72వ మిస్‌ వరల్డ్‌ పోటీసులు ఈ నెల 10 నుంచి 31 వరకు జరగాల్సి ఉంది. భారత్‌- పాకిస్తాన్‌(India-pakistan) మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇక్కడ నిర్వహించాల్సిన అందాల పోటీలపై సందిగ్ధత నెలకొంది. ఇక్కడ పోటీలు రద్దు చేయాలా లేదా షెడ్యూల్‌ మార్చాలా అనే యోచనలో నిర్వాహకులు ఉన్నారని సమాచారం. ఇప్పటికే 70 శాతం మంది పోటీదారులు హైదరాబాద్‌(Hyderabad)కు చేరుకున్నారు. మరో 28 దేశాల నుంచి ప్రతినిధులు రావాల్సి ఉంది. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులను అంతమొందించేందుకు భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor)’ను చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. దీంతో దేశంలోని 18 ఎయిర్‌ పోర్టులను భారత ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేసింది. దేశంలో దాదాపు 200 విమాన సర్వీస్‌లు రద్దయినట్టు అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలోనే మిస్‌ వరల్డ్‌ పోటీల నిర్వహణపై డైలమా నెలకొంది. పేరు నమోదు చేసుకున్నవారు అందరూ రాకుండా పోటీలు నిర్వహిస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని మిస్‌ వరల్డ్‌ సంస్థ ప్రతినిధులు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు భద్రతాపరమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉన్నదని, పోటీదారులతో పాటు, ఈవెంట్‌ కవరేజ్‌ కోసం వచ్చిన విదేశీ మీడియా ప్రతినిధులకు రక్షణ కల్పించడం అంత ఈజీ పని కాదన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సంస్థ ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులతో గురువారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఈ సమావేశం తర్వాత అందాల పోటీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అందాల పోటీలు అవసరమా అని ప్రజాసంఘాలు, మహిళ సంఘాలు నిరసనలు, ఆందోళనలు కూడా చేపట్టాయి. రైతుల వడ్లను కొనేందుకు, వాటికి బోనస్‌ ఇచ్చేందుకు పైసలు లేవని, రాష్ట్రం దివాళా తీసిందంటున్న రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)కి ఈ అందాల పోటీలు అవసరమా అని ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి.

ehatv

ehatv

Next Story