హైదరాబాద్‌లోని కొత్తగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

హైదరాబాద్‌(Hyderabad)లోని కొత్తగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్‌ (Cherlapalli Railway)వద్ద ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల ప్రధాన ముఖ ద్వారం పైకప్పు భాగాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రైల్వే పోలీసులు, స్టేషన్​ సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు. అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని వెల్లడించారు.

ehatv

ehatv

Next Story