✕
కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న రూ.20 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు.

x
కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న రూ.20 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సంగారెడ్డిలో జరిగింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ముజాఫీర్ సంగారెడ్డిలో ఇల్లు విక్రయించారు. రూ.20 లక్షల నగదును కారులో పెట్టుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి బయల్దేరారు. సంగారెడ్డిలోని క్లాసిక్ గార్డెన్ వద్ద బంధువుల ఇంటిముందు కారు ఆపి.. ముజాఫీర్ లోపలికి వెళ్లారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు కారు అద్దాలు పగులగొట్టి.. రూ.20 లక్షలు అపహరించారు.

ehatv
Next Story