వనపర్తి జిల్లా ఘన్ పూర్ మండలం కోతులకుంట తండాకు చెందిన కేతావత్ హనుమంతు(37), భార్య, ఇద్దరు కొడుకులు రవీందర్(19), సంతోష్‌తో కలిసి జీవనోపాధి కోసం గచ్చిబౌలిలోని ఎన్టీఆర్ నగర్(NTR Nagar)కి వలస వచ్చారు.

వనపర్తి జిల్లా ఘన్ పూర్ మండలం కోతులకుంట తండాకు చెందిన కేతావత్ హనుమంతు(37), భార్య, ఇద్దరు కొడుకులు రవీందర్(19), సంతోష్‌తో కలిసి జీవనోపాధి కోసం గచ్చిబౌలిలోని ఎన్టీఆర్ నగర్(NTR Nagar)కి వలస వచ్చారు. హనుమంతు మేస్త్రీగా పని చేస్తుండగా.. పెద్ద కొడుకు రవీందర్ (Ravindar)ఇంటర్ పూర్తి చేసి, జులాయిలా తిరుగుతూ, బెట్టింగ్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇటీవల అప్పులు పెరిగిపోవడం, కుమారుడి ఉన్నత విద్యకు డబ్బుల్లేక హనుమంతు సొంతూరులోని భూమి తాకట్టు పెట్టి రూ.6 లక్షలు తెచ్చాడు.. ఈ డబ్బులపై కన్నేసిన రవీందర్ డబ్బులు బ్యాంకులో, వేస్తే భద్రంగా ఉంటుందని తన అకౌంట్‌లో రూ.2.5 లక్షలు జమ చేయించుకున్నాడు. రవీందర్ ఈ డబ్బులను బెట్టింగ్ యాప్‌లో పెట్టి మొత్తం పోగొట్టుకున్నాడు.. అకౌంట్‌లో ఉన్న డబ్బులు విత్ డ్రా చేద్దామని తండ్రి అడగ్గా స్నేహితుడికి ఇచ్చానని, త్వరలోనే ఇస్తాడని చెప్పాడు. ఈ విషయంలో, అలానే బెట్టింగ్ ఆపాలని తండ్రి హనుమంతు(Hanumanthu), కొడుకు రవీందర్ మధ్య తరచూ గొడవలు జరిగాయి.. ఈ క్రమంలో తండ్రిపై రవీందర్ కక్ష పెంచుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం తండ్రి డబ్బు గురించి అడగ్గా.. స్నేహితుడు ఇచ్చేందుకు వస్తున్నాడంటూ ఎన్టీఆర్ నగర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. తన స్నేహితుడు డబ్బులతో పాటు సర్ ప్రైజ్ ఇస్తాడని చెప్పి తండ్రి కళ్లకు రవీందర్ గంతలు కట్టాడు.. మాటల్లో పెట్టి అప్పటికే తెచ్చుకున్న కత్తితో తండ్రి గొంతులో పొడవుగా, తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు
