సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు, వాకాటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంక్షేమ సంఘం, అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర నేతలు హాజరయ్యారు. సర్దార్ పాపన్నకు గతంలో సరైన గౌరవం లభించలేదని, ఈరోజుతో అది పోయిందని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ధ్వంసం చేస్తోందని.. రాజ్యాంగాన్ని మనువాద రాజ్యాంగంగా మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు జరిగిన ఓట్ల కుంభకోణంపై రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నారు, దేశంలో ప్రజాస్వామ్యానికి విఘాతం ఏర్పడింది, రాజ్యాంగం ప్రమాదంలో ఉందని ఆయన అన్నారు. రవీంద్ర భారతిలో కాన్ ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీ వివేక్ వెంకట స్వామి పాల్గొన్నారు.
