బీసీ బిల్లును కేంద్రం ఆమోదించాలంటూ టీపీసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టారు.

బీసీ బిల్లును కేంద్రం ఆమోదించాలంటూ టీపీసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీసీ బిల్లును ఆమోదించకపోతే మోదీని గద్దె దించుతామన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్లమెంట్ లో బీసీ బిల్లుపై చర్చ జరగాలన్నారు. కేంద్రం 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కోటా బిల్లులు కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నాయన్నారు రేవంత్. నాలుగు నెలలుగా బీసీ బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇదే విషయంపైన అపాయింట్మెంట్ ఇవ్వాలని రాష్ట్రపతిని కోరితే ఇవ్వడం లేదన్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అనుమతితో అనుమతితో తెలంగాణలో కులగణన చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు 42 శాతం బీసీ కోటాబిల్లు తెచ్చామని చెప్పారు. 42 శాతంబీసీ కోటాం పోరాటం చేస్తామన్నారు. బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతామన్నారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కేంద్రం ఆమోదించాలనే డిమాండ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జంతర్‌మంతర్ దగ్గర మహా ధర్నా జరుగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్మహేశ్కుమార్ గౌడ్‌తో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీలోని బీసీ నేతలు, బీసీ సంఘాల నాయకులంతా హాజరయ్యారు.
