తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు అలర్ట్.

తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు అలర్ట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పై కీలక అప్డేట్ వచ్చింది. ఈనెల 23 తర్వాత రైతుల ఖాతాలలో రైతు భరోసా (Rythu Bharosa)నిధులు వేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.గతంలో చాలావరకు రైతు భరోసా డబ్బుల పెండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే పెండింగ్ లో ఉన్న రైతు భరోసా సహాయాన్ని..ఈనెల 23 తర్వాత జమ చేసేందుకు రంగం సిద్ధం చేసింది రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం.
Telangana Rythu Bharosa Guidelines
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర(Telangana) ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇప్పటివరకు మూడున్నర ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక ఈ నెల 23వ తేదీ తర్వాత నాలుగు ఎకరాలు, ఆపైన ఉన్నవారికి కూడా నగదు జమ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇక ఈ రైతుబంధు కింద రెండు విడతల్లో 6000 రూపాయల చొప్పున 12000 ఇస్తున్నారు.
