మన సాంప్రదాయంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది.

మన సాంప్రదాయంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. కానీ రానురాను వివాహ బంధానికి విలువ లేకుండా పోయింది. వివాహేతర సంబంధాలతో భర్తలను మట్టుపెట్టడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. మరికొన్ని దారుణ ఘటనలు కూడా ఈ పవిత్ర బంధంపైనే ప్రశ్నలు రేపుతున్నాయి. పెళ్లి పేరుతో మోసం, బెదిరింపులు, హత్యలు, కుట్రలు వంటివి వెలుగుచూస్తుంటే, విస్మయం కలుగుతోంది. చిన్న చిన్న కారణాలకే భర్తలను భార్యలు హతమారుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. చిప్స్ తేలదని చెప్పి భర్తపై కత్తితో దాడి చేయబోయింది భార్య. కూతురు అడ్డుకుంటున్నా ఆమె ఆపకపోవడంతో, ఇంట్లో ఉన్న హింసాత్మక వాతావరణం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఈ సంఘటనను చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ఘటన చూసి పెళ్లి చేసుకోవడం భయంకరంగా ఉందని, భర్తను ఎప్పుడైనా చంపే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇదే పని భర్త చేస్తే మీడియాలో భార్యను హింసించిన భర్త అని హెడ్‌లైన్స్ వస్తాయని విమర్శిస్తున్నారు.

ehatv

ehatv

Next Story