Anasooya: మార్కాపురంలో అనసూయకు చేదు అనుభవం.. రెచ్చిపోయిన అనసూయ..!

Anasooya: మార్కాపురంలో అనసూయకు చేదు అనుభవం.. రెచ్చిపోయిన అనసూయ..!

By :  ehatv
Update: 2025-08-02 05:36 GMT

యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మార్కాపురంలో ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో మాల్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెను చూడటానికి యువకులు, మహిళలు ఎగబడ్డారు. కొందరు వ్యక్తులు ఆమెపై అసభ్యకర కామెంట్స్ చేశారని, దానికి ఆమె "చెప్పు తెగుద్ది" అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీ ఇళ్లలో ఇదే నేర్పించారా అంటూ ఆమె వారిపై విరుచుకుపడింది. మీ ఇళ్లలో ఉన్న ఆడవారిపై ఇలాగే మాట్లాడుతారా అంటూ ప్రశ్నించింది. గతంలో కూడా అనసూయ తనదైన శైలిలో ట్రోలర్స్‌కు, అసభ్య కామెంట్స్ చేసేవారికి కౌంటర్ ఇస్తూ, "నా ఒళ్ళు నా ఇష్టం, నేను ఎలాంటి డ్రెస్ వేసుకుంటే మీకెందుకు, మా ఆయనే ఏమీ అనడం లేదు, మీరెవరు?" అని కూడా స్పందించిన సందర్భాలున్నాయి. ఈ విషయంలో ఆమె తన స్టైల్, వ్యక్తిగత స్వేచ్ఛను గట్టిగా సమర్థిస్తూ, ట్రోలర్స్‌కు ధీటుగా బదులు ఇస్తుంటుంది. ఈ ఘటనకు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది, ఆమె ధైర్యసాహసాలను నెటిజన్లు మెచ్చుకున్నారు. అనసూయ గతంలో కూడా సోషల్ మీడియాలో తన డ్రెస్సింగ్ స్టైల్‌పై వచ్చే విమర్శలకు, ట్రోల్స్‌కు గట్టిగా కౌంటర్ ఇస్తూ వచ్చింది. ఈ సందర్భంలో కూడా ఆమె తన గట్టి వైఖరిని చాటుకుంది.

కాగా పట్టణంలోని కమలా షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెను చూడటానికి యువకులు, మహిళలు ఎగబడ్డారు. ఉదయం నుంచే ఆమె కోసం ఎదురు చూసిన మార్కాపురం వాసులు ఎట్టకేలకు ఆమె 12గంటలకు ప్రారంభోత్సవానికి రావడంతో కేకలు, కేరింతలతో ఉర్రూతలూగారు. వారిని సముదాయిస్తూ వారిలో కాసేపు ఆమె మాటలతో జోష్‌ నింపారు. అనంతరం షాపింగ్‌ మాల్‌ ప్రారంభించి కొద్ది సేపు ఉన్న తరువాత ఆమె వెళ్లిపోయారు.

Tags:    

Similar News