Center praises KCR: కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయపై కేంద్రం ప్రశంసలు..!
Center praises KCR: కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయపై కేంద్రం ప్రశంసలు..!

కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయపై కేంద్రం ప్రశంసలు కురిపించింది. 2026 ఎకనామిక్ సర్వేను కేంద్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకాలను ఈ సర్వే రిపోర్టు ప్రశంసించింది. 2014 కంటే ముందు 1.31 కోట్ల ఎకరాలకే సాగునీరు లభించేదని, 2014-23 కేసీఆర్ హయాంలో అది 2.3 కోట్లకు పెరిగిందని, కేవలం 9 ఏళ్లలో సుమారు 90 లక్షల ఎకరాలకు ప్రభుత్వం కొత్తగా సాగు నీరు అందించిందని సర్వే వివరించింది. చెరువుల పునురుద్ధరణ, కాళేశ్వరం వల్లే సాగునీటి విస్తీర్ణం పెరిగిందని, తదణుగుణంగా పంటల దిగుబడి అమాంతం పెరిగిపోయిందని తెలిపింది.
అయితే ఈ రిపోర్ట్ ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీకి జోష్‌ని ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీలు విషం చిమ్మాయని, కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ చేసిన పనిని ఇప్పుడు కేంద్రమే అభినందించిందని, కాళేశ్వరం, కూలేశ్వరం అయిందని సీఎం, మంత్రులు పదే పదే చెప్తూ విష ప్రచారం చేశారని, ఇప్పుడు ఏం చెప్తారని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు అంటే ఇవే అని చెప్తున్నారు బీఆర్‌ఎస్ శ్రేణులు. ఆ మేరకు సోషల్ మీడియాలో ఈ వార్తను వైరల్ చేస్తున్నారు.


