AP Belt Shops: ఏపీలో అధికారికంగా బెల్ట్ షాపులు..!
AP Belt Shops: Official belt shops in AP..!
ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత, గతంలో ఉన్న మద్యం పాలసీని మార్చేసింది. గతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపులు ఉండేవి, బెల్ట్ షాపులు ఉండేవి కాదు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం షాపులలో ప్రభుత్వ ఉద్యోగులే ఉండేవాళ్ళు. ఆ మద్యం షాపులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఉండేవి. ఆ మద్యం షాపులలో ప్రభుత్వానికి సంబంధించిన మద్యం మాత్రమే అమ్ముతూ ఉండేవాళ్ళు సో మధ్యానికి సంబంధించిన పాలసీని అంతకుముందున్న పాలసీని మార్చి జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన విధానం అది ఆ ప్రతి ఏట కొన్ని మద్యం షాపులు తగ్గించుకుంటూ కూడా వచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తూ, మేము ఈ మద్యం అమ్ముతాం ఇదే తాగండి అంటూ ప్రజల్ని ఒత్తిరికి గురి చేసింది రకరకాల కొత్త బ్రాండ్లు తీసుకొచ్చింది రకరకాల కొత్త బ్రాండ్లని గత ప్రభుత్వం తీసుకురావడం కారణంగా లక్షలాది మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు కాబట్టి మేము పాత మద్యం విధానాన్నే తీసుకొస్తున్నాం. నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తామంటూ ఎన్నికలకు ముందు చెప్పి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కోటం సర్కార్ మద్యం పాలసీని మార్చింది. మద్యం పాలసీని మార్చిన సందర్భంగా బెల్ట్ షాపులు ఉండవు, బెల్ట్ షాపులు లేవు అని కూడా చెప్తూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవంట, అని అంటే ఏ గ్రామంలో అయినా, ఏ గ్రామంలో మద్యానికి సంబంధించి కాస్త పరిచయం ఉన్న వ్యక్తులకైనా ప్రభుత్వం ఇంత గుడ్డిగా ఉందా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో నాలుగు నుంచి ఐదు బెల్ట్ షాపులు నడుస్తున్న వాతావరణం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రభుత్వం మాత్రం అధికారికంగా బెల్ట్ షాపులు లేవు అని చెప్తుంది. మద్యం ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకునే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఆ మాటకి వస్తే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చాలా ప్రభుత్వాలు మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా మారుస్తూ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం వాడుకుంటూన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపుల దగ్గర, పర్మిట్ రూముల పేరుతో, పర్మిట్ రూములకు పర్మిషన్స్ పేరుతో, కూడా ప్రభుత్వం ఆదాయాన్ని సేకరించడం సమీకరించడం చూస్తూ ఉన్నాం. ఈ మద్యం షాపుల్లో చాలా మందిని టెండర్లు వేయనీయకుండా ఆపారు. పార్టీకి సంబంధించిన వాళ్ళు టెండర్లు వేశారు. టెండర్లు వేరే వాళ్ళకి వస్తే కూడా వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్నారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..