Banakacherla : బనకచర్లపై ఏపీ దూకుడు.. తెలంగాణ ఎక్కడ..!
బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన వివాదాన్ని చూస్తున్నాం. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం తెలంగాణ రాష్ట్రానికి ప్రమాదం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకి విరుద్ధంగా ఉంది

తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధం అంటూ తెలంగాణ ప్రభుత్వం కూడా మాట్లాడుతూ వస్తుంది. ఈ అంశం పైన తెలంగాణ సర్కారు ఉదాసీనంగా ఉంటుంది, తెలంగాణ సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది, తెలంగాణ సర్కారు ఆంధ్రాకు ప్రయోజనాలు చేకూర్చేలా బిహేవ్ చేస్తోంది అంటూ ఇక్కడ ప్రతిపక్షం బిఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పార్టీల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా ఒక రెండు నెలల క్రితమే 24వ తారీకు కంటే ముందే ఒక అధికారుల కమిటీని ఏర్పాటు చేయబోతున్నాం, ఈ అధికారుల కమిటీ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు, నీటి కేటాయింపులకు సంబంధించిన వివరాల పైన అధ్యయనం చేసి, కొన్ని రిపోర్ట్స్ . దాన్ని మేము పాటిస్తామంటూ ఆ మీటింగ్ లో తేల్చారు.
ఆ మీటింగ్ లో బనకచచర్లకు సంబంధించిన ప్రస్తావనే రాలేదు అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడారు కానీ, బనకచర్ల పైన చర్చించామంటూ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రులు ప్రకటించారు. ఆ మీటింగ్ జరిగింది, మీటింగ్ జరిగిన వారం రోజులకి అధికారుల కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది, రెండు నెలలు గడిచిపోయింది ఇప్పటి వరకు అధికారుల కమిటీని ఏర్పాటు చేయలేదు, అధికారుల కమిటీని ఏర్పాటు చేయలేదు కాబట్టి, రికమెండేషన్స్ లేవు. ఇది ఇలా ఉండగా దీనిపైన అధికారుల కమిటీ వేసి ఫర్దర్ గా ముందుకు ఎలా వెళ్ళాలనే దానిపైన, మేము ఒక ఒక రూట్ మ్యాప్ రూపొందించుకుంటమంటూ రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రుల సమక్షంలో నిర్ణయించిన తర్వాత, రెండు రాష్ట్రాలు దేనికి దానిగా బిహేవ్ చేస్తున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బనకచర్లని సెపరేట్ గా చూడాల్సిన అవసరం లేదు, బనకచర్ల, పోలవరం ఒకటే, పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్ గా దాన్ని చూడాల్సిన అవసరం ఉంది.
బనకచర్లకి ప్రత్యేకంగా తెలంగాణ మళ్ళీ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం, పోలవరం ప్రాజెక్టు కు ఉన్న అనుమతి, బనకచర్లకు కూడా ఉంటుంది, కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనుమతి మాకు అవసరం లేదు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదన చేస్తుంది. బనకచచర్ల అనేది ప్రత్యేకమైన ప్రాజెక్టు, బనకచచర్ల ప్రాజెక్టు వరద జలాల ఆధారంగా నిర్మించాలనుకుంటున్న ప్రాజెక్టు, కానీ కొత్తగా ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే సిడబ్ల్యూసీ నియమాల ప్రకారం, సిడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం 75% వాటర్ కి సంబంధించిన అవైలబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే ప్రాజెక్ట్ కట్టాలి, అలా కాకుండా కేవలం వరద జిలాల పైన మేము ప్రాజెక్ట్ కడతామంటూ ఆంధ్రప్రదేశ్ చెప్తుంటే ఎందుకు కేంద్రం సైలెంట్ గా ఉంది, అనే ప్రశ్న కూడా తెలంగాణ వైపు నుంచి రైజ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఫీజబులిటీ రిపోర్ట్ ని అసలు అధ్యయనం చేయొద్దు, పట్టించుకోవద్దు అంటూ రెండు రోజుల క్రితం తెలంగాణ ఇరిగేషన్ శాఖ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. బనకచర్ల ప్రాజెక్ట్ ని అడ్డుకోవాలి అంటూ కోరింది. బనకచర్ల ప్రాజెక్ట్ కి అనుమతులు ఇవ్వద్దు అని కోరింది. బనకచర్ల ప్రాజెక్ట్ కి సంబంధించి ఇప్పటికే కేఆర్ఎంబి కావచ్చు, జిఆర్ఎంబి కావచ్చు వ్యతిరేకించాయి.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
