జూబ్లీహిల్స్‌ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని టెన్షన్ పెడుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా హైడ్రా చేస్తున్న కార్యక్రమాలని బిఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది.

జూబ్లీహిల్స్‌ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని టెన్షన్ పెడుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా హైడ్రా చేస్తున్న కార్యక్రమాలని బిఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. హైడ్రా కూల్చివేతలు, ఆ తర్వాత ప్రజల ఆర్తనాదాలకు సంబంధించిన వీడియోలు కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం చేస్తున్నాయి. హైడ్రా ఇలా ఎందుకు వ్యవహరిస్తుంది, ఒక పక్క ఎన్నికల క్యాంపెయిన్ జరుగుతోంది, ఇంకొక వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అధికారంలో ఉన్న పార్టీ హైడ్రా వల్ల రాజకీయంగా వ్యతిరేకత వస్తుందని తెలిసిన తర్వాత ఈ కూల్చివేతలకు ఎలా అనుమతిస్తుంది. కూల్చివేతలు కంటిన్యూస్ గా జరుగుతున్నాయి కావచ్చు, మధ్యలో ఆగిపోయాయి, మళ్ళీ జరుగుతున్నాయి, కానీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో, ఎన్నికలు జరుగుతున్న రోజుల్లో ఎన్నికల క్యాంపెయిన్ జరుగుతున్న, రోజుల్లో హైడ్రా అనే ఎజెండాగా ఎన్నికలు జరుగుతున్న రోజుల్లో హైడ్రా కూల్చివేతలకు ఏ రకంగా అనుమతులు ఇచ్చారు అనే దానిపైన కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి హైడ్రా కూల్చివేతలు రాజకీయంగా నష్టం చేస్తాయనే ఆందోళన కూడా జూబ్లీహిల్స్ లో గెలవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో వ్యక్తమవుతుంది.

హైడ్రా అధికారులు ఇలా వ్యవహరించడం వెనక హైడ్రా కూల్చివేతల వెనక హైడ్రా పేదల ఇల్లు నేలమట్టం చేయడం వెనక, బిఆర్ఎస్ పార్టీ ఉంది అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. జగ్గారెడ్డి చెప్తున్న దాని ప్రకారం హైడ్రా అధికారుల్లో కొంతమంది బీఆర్‌ఎస్ పార్టీ అనుకూల అధికారులు ఉన్నారు. బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనుకూల అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారు, వాళ్ళ అత్యుత్సాహం కారణంగానే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉండే పార్టీ, కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇళ్లిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదల ఇల్లు కూలగొట్టే పార్టీ కాదు, కానీ కొంతమంది అధికారులు పేదల ఇళ్లని కూల్చేస్తున్నారు, బిఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా లాభం చేయడం కోసం ఇది తన అనుమానం అంటూ నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు.

జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం చేయాలనే ఆలోచనతో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది అధికారులు హైడ్రాలో పని చేస్తున్న అధికారులు, ఈ కూల్చి వేతలకు శ్రీకారం చుట్టారు, ఇటువంటి అధికారుల పైన హైడ్రా చీఫ్ రంగనాథ్‌ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇటువంటి అధికారులని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, ఇటువంటి అధికారులని కంట్రోల్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, ఈ విషయాలన్నీ ఈ కూల్చివేతలు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం అని తెలిసి కూడా, ఈ కూల్చివేతలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్‌లో కాదని తెలిసి కూడా అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారు అనేది ఆయన చెప్తున్న మాట. ప్రజావాణిలో ఫిర్యాదులు వచ్చాయి అనే కారణంతో, వాళ్ళకు వాళ్ళుగా నిర్ణయం తీసుకొని అధికారులు వెళ్లి కూల్చివేతలు చేస్తున్నారనే అనుమానం కలుగుతుంది అంటున్నారు. ఇక ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On
ehatv

ehatv

Next Story