ఆంధ్రప్రదేష్‌లో కేసుల ఎత్తివేత పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఫైబర్నెట్ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న కేసుని ఏసీబి కోర్టు ఎత్తేసింది.

ఆంధ్రప్రదేష్‌లో కేసుల ఎత్తివేత పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఫైబర్నెట్ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న కేసుని ఏసీబి కోర్టు ఎత్తేసింది. తాజాగా మద్యం కేసుని కూడా ఎత్తేసింది. ఇంకా కేసుల పరంపర కంటిన్యూ కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రెండు కేసులు పూర్తిగా తీసేశారు కూడా. ఆ కేసులు తీసేయొచ్చా లేదా దానికి సంబంధించిన టెక్నికాలిటీస్ పైన చాలా అనుమానాలు ఉన్నాయి. వాటిపైన మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కేసులో ఎత్తువేత హామీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఇవ్వలేదు, కూటమి ఇవ్వలేదు, సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చింది కానీ, ఇప్పుడు సూపర్ సెవెన్ హామీలు అమలు చేస్తుంది. ఏడో హామీ చంద్రబాబు నాయుడు, ఆయనకి ఆయన ఇచ్చుకున్నారు. మిగతా ఆరు హామీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలక ఇచ్చారు. ఈ ఏడో హామీ మాత్రం చంద్రబాబు నాయుడు, నేను ముఖ్యమంత్రి అవుతే, నా మీద కేసులు ఎత్తేసుకుంటా అని ఆయనకు ఆయన ఒక హామీ ఇచ్చుకున్నారు, ఆయనకు ఆయనే ఒక హామీ ఇచ్చుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత, చాలా ఆలస్యంగా 17 నెలల పాటు వెయిట్ చేసి చివరికి ఆయనకు ఇచ్చుకున్న హామీని కూడా నెరవేర్చుకున్నారు.
అదే సూపర్ సెవెన్, సూపర్ సెవెన్ హామీని నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా, కేసులో ఎత్తివేత్త పరంపర ప్రారంభమయింది. సో ఏంటి కేసు. మద్యం కేసు ఫైబర్నెట్ కేసు, సంబంధించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, వీడియో కూడా చేసుకున్నాం. ఈ మద్యం కేస ఏంటి, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, బార్లు-వైన్ షాపులు ఇచ్చే ప్రివిలెజ్ ఫీజ్‌ని రద్దు చేస్తూ జీవోలు ఇచ్చింది. అప్పటి సర్కార్ బహుశా 2016-2017 జీవోలు అనుకుంటా, రెండు జీవోలు ఇచ్చింది, ఆ జీవోల ద్వారా బార్లు, వైన్ షాప్లకు సంబంధించిన యజమానులు, ప్రభుత్వానికి ప్రివిలెజ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అని, ఆ ఫీజు అది రద్దు చేసినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు సర్కార్ దిగిపోయే వరకు కట్టాల్సిన ఫీజు రద్దు చేసిన ఫీజు 5300 కోట్ల రూపాయలకు పైగా, 5300 కోట్ల రూపాయలకుపైగా ప్రివిలెజ్ ఫీజ్ ని గత సర్కారు లేకుండా చేసింది. బార్ షాపులకి, వైన్ షాపులకు. ఈ నిర్ణయాన్ని క్యాబినెట్ కి తెలియకుండా తీసుకున్నారు, ఈ నిర్ణయాన్ని క్యాబినెట్ కి చెప్పకుండా తీసుకున్నారు, పైగా ఈ నిర్ణయం తీసుకుంటున్న విషయం కనీసం ఆర్థిక శాఖకు కూడా తెలియదు, ఆర్థిక శాఖకు తెలియకుండా క్యాబినెట్ కు తెలియకుండా, ముఖ్యమంత్రి రహస్యంగా ఈ జీవోని జారీ చేశారు అనేది అభియోగం అప్పట్లో. బ్రీవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, అప్పుడు సిఐడి కేసు నమోదు చేసింది, ఏసీబీ కోర్టులో దీనికి సంబంధించిన చార్జి షీట్ ని కూడా ఫైల్ చేశారు.


