Medical Colleges Issue: చంద్రబాబు ఆత్మవంచన..! మెడికల్ కాలేజీలపై ఆయన వైఖరి ఎవరికి నష్టం..! ఎవరికి లాభం..! 'YNR' విశ్లేషణ...
Medical Colleges Issue: చంద్రబాబు ఆత్మవంచన..! మెడికల్ కాలేజీలపై ఆయన వైఖరి ఎవరికి నష్టం..! ఎవరికి లాభం..! 'YNR' విశ్లేషణ...
టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆత్మవంచన కనబడింది. సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ఆయన ఈ 14 నెలల కాలంలో ఏం చేశామో చెప్పారు. సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేశాం. అద్భుతం, ఆహా ఓహో అంటూ మాట్లాడారు, ఓకే అంతవరకు ఏ పార్టీ అయినా పార్టీకి సంబంధించిన విధానాలు ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోవడాన్ని తప్పు పట్టలేము, చెప్పుకోండి కానీ, ఆయన మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించిన మాట్లాడిన మాటలు మాత్రం ఆయన ఆత్మవంచన చేసుకున్నారు అని అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చింది ఎవరు తమ్ముళ్ళు.. మొత్తం తెలుగుదేశం పార్టీనే తెచ్చింది అని చెప్తున్నారు, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను, దాచేస్తే దాగేదా ఎవరు తెచ్చారు, మెడికల్ కాలేజీలు కేంద్రంలో ఎన్డిఏ సర్కారు 2024 కంటే ముందే ఆంధ్రప్రదేశ్ కి 17 మెడికల్ కాలేజీలు ఇచ్చామని చెప్తుంది ఎన్డిఏ సర్కారు. ఎన్డిఏ సర్కారే 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చాం, గత టెన్యూర్ లో అని చెప్తుంటే, మీరు ఇప్పుడు వచ్చి మేము మెడికల్ కాలేజీలు తెచ్చామని చెప్తే ఎలా దాన్ని సమర్ధించుకుంటారు, ఆత్మవంచన చేసుకోవడం కాదా అది, పైగా పిపిపి మోడల్ లో ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీలు ఇవ్వడాన్ని ఎలా సమర్ధించుకుంటారు, మనసు ఎలా వస్తుంది మీకు, అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం పిపిపి విధానాన్ని తీసుకొచ్చాం, ఆస్తి మనది, వేరేవాళ్ళు దాన్ని రన్ చేస్తారు, జవాబుదారితనంగా ఉంటారు , మెడికల్ కాలేజీలు కట్టడం అంటే, భూములు ఇవ్వడం మాత్రమే కాదు, బిల్డింగలు కట్టడం మాత్రమే కాదు, నిర్వహణకి చాలా ఖర్చు అవుతుంది అంటూ ముఖ్యమంత్రి ఆ సభలో చెప్తున్నారు, నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు భూమి ఇస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు, ఆంధ్రప్రదేశ్ కి ఒక రాజధానిని లక్ష కోట్ల రూపాయలతో మనం కడుతున్నాం వేల కోట్లు ఖర్చు పెట్టి, రాష్ట్ర ప్రజలందరి కోసం ఓ 10 మెడికల్ కాలేజీలు కట్టలేమా, ఇంకో 10 వేల కోట్లు అప్పు తీసుకొచ్చి ఓ 10 మెడికల్ కాలేజీలు కట్టలేమా, ప్రతి మంగళవారం ఆర్బిఐ దగ్గరికి వెళ్లి బాండ్లు వేలం వేసి 4000 కోట్లు, 5000 కోట్లు, 6000 కోట్లు, గడిచిన 14 నెలలుగా ఒక్క వారం పోకుండా తీసుకొస్తున్నాం కదా, ఒక్క వారం తీసుకొచ్చిన డబ్బులతో ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీలున్నీ కట్టలేమా, ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు కట్టగలమా లేదా అనే అంశాన్ని, ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తుల చేతులలో ఉంటే రాష్ట్ర ప్రజలకు జరిగే నష్టం ఏంటి, ప్రభుత్వం దగ్గర ఉంటే రాష్ట్ర ప్రజలకు జరిగే లాభం ఏంటి అనేది కదా ఆలోచన చేయాలి. ప్రభుత్వం వ్యాపారం చేయట్లేదు కదా, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా, నష్టం వచ్చినా, అప్పులు తెచ్చియినా చేయాల్సిన పని వైద్యం అందించడం కదా, ఏ ప్రభుత్వానికైనా ఉండాల్సిన ప్రథమ ప్రయారిటీలు, విద్యా వైద్యం మాత్రమే కదా, అటువంటి విద్యని వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి, ప్రభుత్వం ఇంకేం చేస్తామనుకుంటున్నారు.