CM Revanth Reddy Controversy Comments: కాంగ్రెస్‌కు రేవంత్‌ అవమానం..! తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రా..! కాంగ్రెస్ ముఖ్యమంత్రా..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గానికి వెళ్ళారు. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకు స్థాపనలు చేశారు. ఆ తర్వాత సభలో మాట్లాడారు, మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ఒక సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. ఆ ఉపన్యాసంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, కాంగ్రెస్ పార్టీని అవమానించేలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా అవమానంగా ఫీల్ అయ్యే తరహా వ్యాఖ్యలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సభలో మాట్లాడిన మొదటి 15 నిమిషాల స్పీచ్ విన్న వాళ్ళకి ఎవరికైనా అనిపిస్తుంది, ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉన్నారా అని అనుమానం ఖచ్చితంగా ఎవరికైనా కలుగుతుంది. ముఖ్యమంత్రి ప్రసంగం మొదటి 15 నిమిషాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసన సభ్యుడిగా గెలిచి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసన సభ్యులంతా కలిసి, ఆయనను శాసన సభ పక్ష నాయకుడిగా ఎన్నుకుంటే, తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రి పీఠంపైన కూర్చున్నట్లుగా మాట్లాడారు. మొదటి 15 నిమిషాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, తెలుగుదేశం పార్టీ క్యాడర్ ని ఉత్సాహ పరిచే తరహాలో మాట్లాడారు. అంతేకాదు అక్కడ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రస్తావన వచ్చిన సందర్భంగా, బిఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోవాలంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు నడుము బిగించాలి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేడర్‌ నడుము బిగించాలి అన్నారు. గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ దిమ్మెలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకుండా చేయాలి, కూల్చేయాలి తరహా వ్యాఖ్యలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. కాంగ్రెస్ పార్టీకి బలమైన జిల్లాలలో, ఉమ్మడి రాష్ట్రంలోనే, కాంగ్రెస్ పార్టీకి బలమైన జిల్లాలలో ఖమ్మం జిల్లా ఒకటి. ఉమ్మడి రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42 స్థానాలకు కేవలం ఐదు అంటే ఐదు పార్లమెంట్ స్థానాలు గెలిచిన రోజుల్లో కూడా, ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంటుంది. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేడర్‌ రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఉండే కేడర్‌ కంటే భిన్నంగా ఉంటారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ కేడర్‌ కమ్యూనిస్ట్ పార్టీలతో దశాబ్దాలుగా పోరాటం చేస్తూ వస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన కేడర్‌ ఎంత బలంగా సిద్ధాంతపరంగా ఉంటారో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేడర్‌ కూడా అదే స్థాయిలో ఉంటారు. అంత బలంగా ఉంటారు, పార్టీ నాయకత్వంతో సంబంధం లేకుండా, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని కాపు కాస్తూ వస్తున్న నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సొంతం. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా, ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీలతో విభేదాల కారణంగా, ఘర్షణల కారణంగా హత్యలకు గురైన వందల మంది కార్యకర్తలు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉంటారు. కాంగ్రెస్-కమ్యూనిస్టుల మధ్య గొడవల కారణంగా అనేకమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఖమ్మం జిల్లాలో చూస్తుంటాం. ఖమ్మం జిల్లాలో మినహా ఇంకెక్కడా కనపడని కొన్ని దృశ్యాలు మనం గుర్తు చేయదలుచుకున్నాం మీకు. ఖమ్మం జిల్లాలో ఒక పక్క చనిపోయిన కార్యకర్తలకు సంబంధించిన స్తూపాలు కట్టిన, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన నాయకుల స్తూపాలు కనపడతాయి, అదే స్థాయిలో మూడు రంగుల జెండాలు వేసిన కాంగ్రెస్ కార్యకర్తల స్తూపాలు కూడా కనపడతాయి. అంతమంది కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేసిన చరిత్ర ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా. ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా. అటువంటి ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజక వర్గానికి ప్రధానంగా మీరు వెళ్ళింది, పాలేరు నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత గెలవలే, ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డ తర్వాత పాలేరు నియోజక వర్గంలో, తెలుగుదేశం పార్టీ నుంచి శాసన సభ్యుడు ఎవరు గెలవలేదు. ఈ క్షణం వరకు అనేక సందర్భాల్లో కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకున్నప్పుడు, కమ్యూనిస్టులకు ఆ సీటు ఇచ్చారు. కమ్యూనిస్టులతో పొత్తులు లేనప్పుడు ఒంటరిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది, భారతీయ జనతా పార్టీతో పొత్తున్నప్పుడు ఒంటరిగా తెలుగుదేశం పార్టీ పాలేరు నియోజక వర్గంలో పోటీ చేసింది. పాలేరు జనరల్ లో ఉన్నప్పుడు కావచ్చు, రిజర్వ్ లో ఉన్నప్పుడు కావచ్చు, ఏ ఒక్క సందర్భంలోనూ పాలేరు నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవలేదు. పాలేరు నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా గెలుస్తూ వచ్చింది, ఆ తర్వాత కమ్యూనిస్టులు గెలిచారు, అంత బలంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న నియోజక వర్గానికి వెళ్లి, తెలుగు దేశం పార్టీ, ఒక్కసారి కూడా గెలవని ఒక నియోజక వర్గంలో నిలబడి బిఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలంటే, తెలుగు దేశం పార్టీకి సంబంధించిన నాయకులు నడుము బిగించాలంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులని కార్యకర్తలని అవమానించడం కాదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్ట్రెంత్ ఏంటి, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల బలం ఏంటో కనీసం ముఖ్యమంత్రికి తెలిసి ఉండాలి కదా. ఖమ్మం జిల్లా అంటే తెలుగుదేశం జిల్లా అనేసుకుంటారా, ఖమ్మం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అక్కడికి వెళ్లి కీర్తిస్తే సరిపోతుంది అనుకుంటారా, ఏ రకంగా ఖమ్మం జిల్లాలో సామాజిక వర్గం బలంగా ఉంటుందనే ప్రచారం ఉంది కాబట్టి, ఆ సామాజిక వర్గాన్ని బ్యాకప్ చేస్తున్న తెలుగుదేశం పార్టీని పొగిడితే, కీర్తిస్తే, వాళ్ళంతా మనకు ఓట్లు వేస్తారనే ఒక చీప్ ప్రాక్టీస్ గా కనపడుతుంది. అది ఖమ్మం జిల్లాలో సామాజిక వర్గం బలంగా ఉండే మాట నిజమే కావచ్చు కానీ, ఖమ్మం జిల్లాలో అన్ని పార్టీలు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకత్వం చేతిలోనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నారు. బిఆర్ఎస్ పార్టీని ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే లీడ్ చేస్తున్నారు.ఆ మాటకు వస్తే విప్లవ పార్టీలని కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు లీడ్ చేస్తున్నారు. అప్పుడు ఆ సామాజిక వర్గం మొత్తం తెలుగు దేశ పార్టీ వెనకే ఉంది అని ఎలా చెప్తారు, తెలుగు దేశం పార్టీని పొగిడితే, చంద్రబాబు నాయుడుని పొగిడితే ఆ సామాజిక వర్గం ఓట్లన్నీ మీకు వస్తాయిని ఎలా అంతా అమాయకంగా అనుకుంటారు, బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో లేని సందర్భంలో కూడా, కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పర్ఫార్మ్ చేసింది ఖమ్మం జిల్లాలో. కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ లేకపోయినా అఫీషియల్ గా లేకపోయినా, అనఫిషియల్ గా లేకపోయినా, కాంగ్రెస్ పార్టీ బలంగా పర్ఫార్మ్ చేసింది ఖమ్మం జిల్లాలో. అటువంటి జిల్లాలోకి వెళ్లి బిఆర్ఎస్‌ని ఓడించాలంటే, బిఆర్ఎస్‌ని లేకుండా చేయాలంటే మాకు తెలుగుదేశం పార్టీనే దిక్కు అని మీరు మాట్లాడిన మాటలు ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలుగా చూడలేము, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అలా మాట్లాడడు, కాంగ్రెస్ పార్టీ కేడర్‌ని ఖమ్మం జిల్లాకి వెళ్లి రేవంత్ రెడ్డి అవమానించి వచ్చారా అంటే, కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేడర్‌ అదే మాట్లాడుకుంటారు. రేవంత్‌ వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!

Updated On
ehatv

ehatv

Next Story