Election Commission: ఎన్నికలకు మద్యం నిధులు నిజమేనా ? రంగంలోకి ఈసీ

Is alcohol funding for elections real? EC enters the fray

By :  ehatv
Update: 2025-12-31 11:02 GMT

అడకత్తెరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అడకత్తెరలో ఆంధ్రప్రదేశ్లో సిట్, ఏ సిట్ మద్యం పైన ఏర్పాటైన సిట్‌, మద్యం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ని ఏర్పాటు చేసింది. సీట్ ని ఏర్పాటు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి బాకా ఊదుతున్న పత్రికల్లో రకరకాల కథనాలు వచ్చాయి. ఈ కథనాలన్నిటిని క్రోడీకరించి కొంతమంది వ్యక్తులను విచారించి చేసిన నివేదికగా, సిట్ ఒక చార్జ్ షీట్ ని ఫైల్ చేసింది. రెండు చార్జ్ షీట్లు ఫైల్ చేసింది, ఈ రెండు చార్జి షీట్లలో ఉన్న అంశాల ఆధారంగా రకరకాల చర్చ బయట జరగడం చూశాం. ఏముంది ఈ చార్ట్ షీట్ లో, ఈ చార్ట్ షీట్ లో ఏముంది అంటే, 3500 కోట్ల రూపాయలు అక్రమంగా మద్యం ద్వారా సేకరించి, ఈ డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. ప్రతి నియోజక వర్గంలో ఖర్చు పెట్టారని సిట్ తేల్చింది. సిట్ తేల్చిన విషయాన్ని చార్ట్ షీట్లో పొందుపరిచింది. చార్జి షీట్ లో పొందుపరిచిన ప్రతి అంశాన్ని నిరూపించాల్సిన బాధ్యత, నిరూపించడానికి సంబంధించిన బేస్ ఉన్న తర్వాత మాత్రమే సిట్ చార్జి షీట్లో అక్షరాలను పెడుతుంది. అంటే 3,500 కోట్ల రూపాయలు ప్రతి నియోజక వర్గంలో ఖర్చు పెట్టారు అనే దానికి సంబంధించిన అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది అని చార్ట్ షీట్ లో సిట్ పేర్కొంది. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడకత్తెరలో పడేసింది. ఎలా చెప్తా ఆ ఈ అంశం పైన ఆంధ్రప్రదేశ్లో జై భీమరావ్ భారత్ పార్టీకి సంబంధించిన కొంతమంది పోటీ చేసిన అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్ కి ఒక లేఖ రాశారు. మీరేమో ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా నిర్వహించామని చెప్పారు, ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పారు, ఆంధ్రప్రదేశ్ లో మనీ ఫ్లో లేకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారు అని చెప్పారు, ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు ప్రకటించారు కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ ఏమో ఎన్నికల్లో 3500 కోట్ల రూపాయలు నిధులు ఖర్చాయి అని చెప్తుంది. మరి దీనికి మీరు ఏం ఆన్సర్ చేస్తారు అంటూ ఈ అభ్యర్థులంతా ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాశారు. మామూలుగా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కలిసి ఖర్చు పెడితే కూడా ఒక 7800 కోట్ల రూపాయలు ఆఫీషియల్ గా కావాలి కానీ, 3,500 కోట్ల రూపాయలు అయింది అనేది సిట్ చెప్తోంది. ఆన్ ఆన్ రికార్డ్ చెప్తుంది. ఒక విచారణ సంస్థ చెప్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ సంస్థ దీని పైన మీ వర్షన్ ఏంటి, ఇది గనుక సిట్ చెప్పింది గనుక నిజమైతే, మేమంతా డబ్బులు ప్రవాహం కారణంగా, డబ్బులు పంపిణీ కారణంగానే ఓడిపోయినట్లు కదా, మాకు అన్యాయం జరిగినట్లు కదా మాకు న్యాయం చేయండి అంటూ ఎలక్షన్ కమిషన్ జై భీమరావు భారత్ పార్టీ అభ్యర్థులు ఆశ్రయించారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ వైఎన్‌ఆర్ విశ్లేషణ..!Full View

Tags:    

Similar News