Bihar Elections : బీహార్ ఎన్నికల్లో ఆపరేషన్ సింధూరే బీజేపీకి దిక్కా..!
బీహార్ ఎన్నికల్లో విజయం కోసం భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహానికి భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది.

బీహార్ ఎన్నికల్లో విజయం కోసం భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహానికి భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది.చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాచురల్‌గా భారతీయ జనతా పార్టీ నాయకులకు ఇష్టం లేకపోవచ్చు. కానీ మతం ప్రచారం మతం పేరుతో ఓట్లు అడగడం చూస్తూ వచ్చాం. 80/20 అంటూ ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ చేసిన క్యాంపెయిన్ ని కూడా చూశాం. హిందుత్వం అనేది భారతీయ జనతా పార్టీకి ఒక ట్రంప్ కార్ట్ గా ఎన్నికల సమయంలో వాడుతూ ఉండడం అనేక సందర్భాల్లో చూశాం. బట్ బీహార్ ఎన్నికల సందర్భానికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ ఒక కొత్త లాజిక్ తీసుకొస్తుంది. బీహార్‌లో మతాల పేరుతో ఓట్లు అడగడం అనేది భారతీయ జనతా పార్టీకి కలిసి రాదు, భారతీయ జనతా పార్టీ మతం పేరుతో ఓట్లు అడిగితే, బీహార్ ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదు. బీహార్ ప్రజలు కులాల వారీగా విడిపోయి ఉంటారు అంటూ పేరుంది. బీహార్‌లో మూడు సార్లు ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకున్నప్పటికీ మోదీని చూసి, మోదీ కోసం ఓట్లు వేసిన పరిస్థితి కంటే, నితీష్ తో కలిసి ఉండటం మాత్రమే అక్కడ ఎన్డీఏకి, మోడీకి కలిసి వచ్చింది అనేది నిజం.
గణాంకాలు చెప్తున్న నిజం. ఈ నేపథ్యంలో బీహార్‌లో మతం కంటే మరేదో మనం ఇక్కడ రైజ్ చేయాలి, అది మాత్రమే ఓట్లు తెచ్చిపెడుతుంది అని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. గతంలో కూడా నేను చెప్పాను ఆపరేషన్ సింధూరే బీహార్‌లో భారతీయ జనతా పార్టీకి దిక్కు అవుతుందా అని, నిజానికి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైన హర్షాతిరేకాలు వ్యక్తమైనప్పటికీ, ఆపరేషన్ సింధూర్‌ని ఆపేసిన విధానం పట్ల ఏన్డీఏపైన, మోదీపైన తీవ్ర వ్యతిరేకత దేశవ్యాప్తంగా వచ్చిన మాట నిజం. ఆ వ్యతిరేకత మరింత పెరగడానికి ట్రంప్ పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు కూడా దోహదం చేస్తూన్నాయి. ఇప్పటివరకు ట్రంప్ వ్యాఖ్యలపైన కనీసం స్పందించని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న బీహార్ ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంగా ఆపరేషన్ సింధూర్నే మళ్ళీ ప్రస్తావించారు. ఆపరేషన్ సింధూర్ ఓట్లు తెచ్చిపెడుతుందని భారతీయ జనతా పార్టీ నమ్ముతోంది. ఆపరేషన్ సింధూర్ పేరు చెప్పి బీహార్‌లో ఓట్లు అడుగుతోంది . మతం కంటే పాకిస్తాన్ పేరు చెప్పి ఓట్లు అడగడం ఇక్కడ మనకి కలిసి వస్తుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. నేరుగా ప్రధాని మోదీ 11 ఏళ్ళు బీహార్‌కు తామేం చేశామా అనే దానికంటే, 20 ఏళ్ళు నితీష్ కుమార్ బీహార్ కి ఏం చేశాడు అనే దానికంటే కూడా, పెహల్గాం దాడులు ఆపరేషన్ సింధూర్ వీటిపైన కాన్సంట్రేట్ చేశారు. ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


