Jagan Changed: జగన్‌లో మార్పు కనపడుతోంది..!
Jagan Changed: జగన్‌లో మార్పు కనపడుతోంది..!
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి, తన పార్టీ ఇంకా, ఏ పార్టీకి కూడా స్నేహితుడు కాదు లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతుంది. రాజకీయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్రెండ్లీ పార్టీ ఏది అంటే కనపడవే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బిఆర్ఎస్ పార్టీతో వైసీపీకి స్నేహం ఉంది అంటే, కాస్త బిలీవ్ చేయొచ్చు, స్నేహం ఉంది తమిళనాడుకు సంబంధించిన డిఎంకేతో స్నేహం ఉంది అంటే, ఓకే స్నేహం ఉండొచ్చు, అనుకుంటాం. ఈ రెండు మినహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్రెండ్లీ పార్టీ ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉండే రాజకీయ పార్టీ ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఏ పార్టీకి దగ్గరగా ఉంటుంది, ఏ పార్టీతో ఫ్రెండ్షిప్ ఉంది అంటే, ఏ పార్టీతో ఉన్నట్టు కనపడదు. అలా మెయింటైన్ చేసే ప్రయత్నం కూడా వైసీపీ చేసినట్టు కనపడదు మనకు, ఎక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నేషనల్ పాలిటిక్స్ లో, నేషనల్ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండే పార్టీలతో, నిత్యం రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఓ రాజకీయ పార్టీగా నాలుగు పార్టీలతో కలిసి పోరాటం చేయడం, కలిసి మాట్లాడుకోవడం, కలిసి వ్యూహాలు రెడీ చేసుకోవడం, కలిసి రేపు పొద్దున భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏంటి, అనేది మాట్లాడుకోవడం అనేది, చాలా కామన్. బట్ వైసిపి విషయంలో అది ఉండదు, వైసార్ కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా ఒక గిరి గీసుకొని దానిలో మాత్రమే ఉంటుంది, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పార్టీలతో కూడా ఎప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కలిసి పని చేయడం, కలిసి డయాస్ షేర్ చేసుకోవడం చూడం. 2014 లో రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ పోటీ చేసిన సందర్భంగా కూడా సింగిల్ గానే పోటీ చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ సమయంలో పవన్ కళ్యాణ్, కమ్యూనిస్టుల తోటి, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్, టిడిపి కలిసి 2014 ఎన్నికల్లో పోటీ చేశాయి. 2019 ఎన్నికల నాటికి వైసీపీ ఒంటరిగానే పోటీ చేసింది, టీడిపి ఒంటరిగా పోటీ చేసింది, జనసేన లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. సో టిడిపి తోటో, జనసేన తోటో, ఇంకేదో పార్టీలు కలిసి పని చేస్తున్నాయి, పోటీ చేస్తున్నాయి, వైసీపీ తో మాత్రం కలిసిన ఇంకో పార్టీ లేదు. దానికి ఇంకో పార్టీని తప్పు పట్టడం కంటే, వైసీపీ ఇంకొకళతో కలిసే ప్రయత్నం చేయట్లేదు, ఇంకొకొరి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు, నలుగురు కలిసి పోరాటం చేద్దాం అనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అని అనిపిస్తుంది మనకి. ఇక 2024 వచ్చేసరికి సింహం సింగిల్ గానే వస్తుంది, మేము ఎవరితో కలవం అంటూ చెప్తూ వచ్చింది, సింహం సింగిల్ గా ఉంటే ఐసోలేట్ అయిపోతుందనే విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహుశా గమనించినట్లు కనపడుతుంది. వైసార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ, జగన్మోహన్ రెడ్డిలోన మార్పు కనబడుతుంది, గతంలో ఎప్పుడూ చూడని మార్పు ఇది, గతంలో ఎప్పుడూ చూడని మార్పు ఇది, ఏంటి ఆ మార్పు అంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ప్రభుత్వ తీరుని తప్పుపడుతూ ఇది రాష్ట్రానికి నష్టం చేస్తుంది, రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేస్తుంది, పేద ప్రజలకు నష్టం చేస్తుంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలి, మిగతా రాజకీయ పార్టీలతో కూడా మేము మాట్లాడతాం, మిగతా రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలి, మిగతా రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వం పైన ఫైట్ చేయాలి అని మాట్లాడారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ...