దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిని ఉత్కంఠని రేపిన బీహార్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అనేది ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి.

దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిని ఉత్కంఠని రేపిన బీహార్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అనేది ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఆ ఎన్నికలు ముగిశాయి, రెండు దశలో ఎన్నికలు జరిగాయి. రెండు దశల ఎన్నికలు నిన్న సాయంత్రంతో ముగిసిన నేపథ్యంలో అనేక సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ని ప్రకటించాయి. ప్రధానమైన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అన్నీ కూడా అక్కడ ఎన్డీఏ తిరిగి మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అనే విషయాన్ని స్పష్టం చేశాయి. అక్కడ మహా ఘట్ బంధన్ మళ్ళీ ఓటమి చవి చూడక తప్పదు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశాయి. ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, అలాగే కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు కలిసి అక్కడ ఎన్నికల పోటీ చేశాయి.
20 ఏళ్లుగా నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం బీహార్‌లో నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి వస్తామనే ఎంజీబీలో కనిపించింది. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో అక్కడ వన్ సైడెడ్ గా ఎన్డీఏ విజయం సాధించబోతున్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఎగ్జాక్ట్ పోల్స్ ఎలా ఉంటాయో చూడాలి. నిజానికి గడిచిన ఎన్నికల సందర్భంగా 2020 లో జరిగిన ఎన్నికల్లో అక్కడ హోరాహోరీ ఫైట్ చూశాం.
కూటమి అలాగే 125 స్థానాలతో ఎన్డీఏ అక్కడ ఎన్నికల ఫలితాలు సాధించాయి. కేవలం తక్కువ మార్జిన్‌తో అక్కడ ఆర్జేడి నేతృత్వంలో అధికారానికి దూరమైంది గడిచిన ఎన్నికల్లో. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికంగా 73 స్థానాలు ఇస్తే. కేవలం 19 స్థానాల్లోనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎక్కువ స్థానాలు తీసుకోవడం ద్వారా అధికారానికి ఆర్జేడీని దూరం చేసింది ఇలాంటి చర్చ ఆ సందర్భంలో చూశాం. ఈసారి అటువంటివి ఏం లేకుండా కాస్త జాగ్రత్త పడ్డారు. 60 స్థానాలకి కాంగ్రెస్ పార్టీని పరిమితం చేశారు. కలిసి ఎన్నికలకి వెళ్తున్నాం, గ్యారెంటీగా గెలుస్తాం, ప్రమాణ స్వీకారానికి సంబంధించిన డేట్ ని కూడా తేజస్వి అనౌన్స్ చేశారు. దానికంటే ముందు బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ చేయడం 60 లక్షల మందికి పైగా ఓటర్లు తొలగించారు. ఈ ఓట్ల తొలగింపు అంశం, ఓట్ చోరీకి సంబంధించిన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అజెండాగా చేస్తూ వచ్చింది. ఓట్ల చోరీకి సంబంధించిన ఎజెండాని ప్రజలు పట్టించుకోలేదు అనే విషయం బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ గనుక ఎగ్జాక్ట్ పోల్స్ అవితే భావించాల్సి ఉంటుంది.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


