Naveen Yadav : నవీన్కే జూబ్లీహిల్స్ టికెట్.. రేసులో కాంగ్రెస్..!
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్ని ప్రకటించింది.

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్ని ప్రకటించింది. నవీన్ యాదవ్ని తమ అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ రేసులో డెఫినెట్ గా రేస్ లోకి వచ్చింది అని చెప్పొచ్చు. జూబ్లీహిల్స్ గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణలో జరిగిన మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆ స్థానంలో విజయం సాధించలేదు సరి కదా, ఒకసారి మూడో స్థానంలోకి కూడా వెళ్ళిపోయింది. 2014 లో అక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది, 2018లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 2023 లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మూడు సార్లు కూడా మాగంటి గోపీనాథ్ అక్కడ ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు.
కాంగ్రెస్ పార్టీ ఒకసారి మూడో స్థానంలోనూ, రెండుసార్లు రెండో స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంఐఎం కూడా గణనీయంగా ప్రభావం చూపించే నియోజక వర్గాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా ఒకటి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించబడ్డ నవీన్ యాదవ్ 2014 లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఇంకొక నాలుగున్నర 5వేల ఓట్లు వస్తే ఆయన 2014 లోనే ఎమ్మెల్యే గా గెలిచే పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్ గా స్ట్రెంత్ గా ఉన్నారు, నవీన్ యాదవ్ కుటుంబం ఆ ప్రాంతంలో సుదీర్ఘకాలంగా ఉంది. ఆ కుటుంబానికి ప్రత్యేకమైన పేరు ఉంది, ఆ కుటుంబానికి ఆ ప్రాంతంలో బలం ఉంది, నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, పీజేఆర్ తో కలిసి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉండేవారు. ఆయన పిజేఆర్ తో విభేదించి 99 ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అప్పుటి ముఖ్యమంత్రి ఆయన 1999లో ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారు, టికెట్ ఇస్తా అనే హామీతోటే శ్రీశైలంయాదవ్ని పార్టీలో చేర్చుకున్నారు. బట్ అనూహ్యంగా ప్రజాదీవన పేరుతో కార్యక్రమం పెట్టి రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని పార్టీలో చేర్చుకొని అప్పుడు టిడిపి టికెట్లు ఇచ్చింది. అలా టికెట్ దక్కించుకున్న వాళ్ళలో సిబిఐ డైరెక్టర్ గా ఉన్న విజయ రామారావు అప్పుడు ఖైరతాబాద్ నుంచి టికెట్ దక్కించుకొని, తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు.
నిజానికి ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ టికెట్, శ్రీశైలం యాదవ్కు రావాల్సి ఉంది. తర్వాత ఆ కుటుంబానికి రాజకీయంగా అవకాశం దొరకలేదు. నవీన్ యాదవ్ గతంలో కార్పొరేటర్ గా పని చేశారు, ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయారు, ప్రస్తుతం ఆయన కుటుంబం ఆ ప్రాంతంలో గడిచిన ఎన్నికల కంటే ముందు, గడిచిన తెలంగాణ శాసన సభ ఎన్నికల కంటే ముందు, కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ కి టికెట్ కేటాయించింది, అజారుద్దీన్ విజయం కోసం నవీన్ యాదవ్ టీం పని చేశారు. సో ఇప్పుడు ఉప ఎన్నిక రావడంతో నవీన్ యాదవ్ కి అవకాశం దొరికింది, నవీన్ యాదవ్ కి అక్కడ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా, ఇండివిడ్యువల్ గా ఓటు బ్యాంక్ ఉంది.2018 ఎన్నికల సందర్భంగా ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 18,000కు పైగా ఓట్లను సాధించారు, సో సొంత బలం ఎంఐఎం పార్టీకి సంబంధించిన మద్దతు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ట్రెడిషనల్ ఓట్ బ్యాంకు, ఇవన్నీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ గా మారబోతున్నాయి. నవీన్ యాదవ్ మినహా మరో అభ్యర్థి ఇంకెవరైనా ఎవరున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి అంత స్ట్రెంత్, అంత బేస్ ఆ నియోజక వర్గంలో డెఫినెట్ గా ఉండేది కాదు. జూబ్లీహిల్స్ ఎన్నికలపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
