Kaleshwaram Commission Report : కేసీఆరే టార్గెట్.. కమిషన్ చెప్పిందిదే..!
కాలేశ్వరం ప్రాజెక్ట్ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసిన సందర్భంలో, ఇది కక్షపూరిత కమిషన్ అంటూ బిఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ వచ్చింది.

కాలేశ్వరం ప్రాజెక్ట్ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసిన సందర్భంలో, ఇది కక్షపూరిత కమిషన్ అంటూ బిఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ వచ్చింది. కక్షపూరితంగానే కమిషన్ వేశారు, రాజకీయపరమైన దురుద్దేశాలు దీని వెనక ఉన్నాయంటూ బిఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. సో ఈ కమిషన్ రిపోర్ట్ ఎట్టికలకు ప్రభుత్వానికి అందింది. ఈరోజు క్యాబినెట్‌లో కమిషన్ రిపోర్ట్ పైన చర్చ జరగబోతోంది. సో కమిషన్ రిపోర్ట్ పైన ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది, ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తుంది. ఈ కమిషన్ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి, సమావేశాల్లో దానిపైన చర్చించి రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్యేలందరికీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సేమ్ టైం దీనిపైన ఒక డిజీ స్థాయి అధికారితో సిట్ ని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సో ఈ మొత్తం అంశానికి సంబంధించి కమిషన్ తేల్చింది ఏంటి అంటే, కమిషన్ ప్రధానంగా కెసిఆర్ టార్గెట్ గా ఈ రిపోర్ట్ ఇచ్చినట్టు కనపడింది. కేసీఆర్‌ని టార్గెట్ కమిషన్ చేయాలనే ఉద్దేశంతో చేసిందా లేకపోతే కమిషన్ విచారణ చేసిన సందర్భంగా అటువంటి ఇన్‌పుట్స్ వాళ్ళకి దొరికాయ తెలియదు కానీ, ఈ మొత్తం రిపోర్ట్ కు సంబంధించిన కొన్ని బుల్లెట్ పాయింట్స్ కొన్ని ప్రధానమైన అంశాలు బయటికి వచ్చిన నేపథ్యంలో, దానిలో ఉన్న అన్ని అంశాల్లో కూడా కేసీఆరే కారణంగానే, కేసీఆర్ కారణంగానే ఈ ప్రాజెక్ట్ ఒక విఫలమైన ప్రాజెక్టు గా మిగిలిపోయింది, ఇలాంటి ఒక ఇంప్రెషన్ ని ఈ కమిషన్ ఇచ్చినట్లు కనపడుతుంది. ప్రధానంగా కేసీఆర్‌పైన ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ అంశానికి సంబంధించి బాధ్యత ఉంది ప్రణాళిక చేయడంలోనూ, అమలు చేయడంలోనూ, పూర్తి చేయడంలోనూ నిర్వహించడంలోనూ, పని నిర్వహణలోనూ నిబంధనల్ని విధానాల్ని పూర్తిగా పక్కన పెట్టేసి చేశారు, కాబట్టి కేసిఆర్ పైన ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యత ఉంది. ఈ ప్రాజెక్ట్ అంశానికి సంబంధించి అంటూ కమిషన్ చెప్తుంది, దాంతో పాటు మంత్రివర్గ అనుమతి లేకుండానే, మంత్రివర్గానికి సంబంధించిన అనుమతి లేకుండానే, ప్రాజెక్ట్ పైన ఏకపక్షంగా ఆయన సొంతంగా ముందుకు వెళ్ళారనేది, కూడా కమిషన్ ఫైండింగ్స్ గా కనపడుతుంది. బిజినెస్ రూల్స్ ని పూర్తిగా ఉల్లంఘించారు అనేది కూడా కమిషన్ ఫైండింగ్ గా కనబడుతుంది, విధానాల ఉల్లంఘన, మంత్రివర్గ ఆమోదం లేకపోవడం, మొదటి అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్స్ ని , క్యాబినెట్ లో కూడా కనీసం పెట్టలేదు పరిపాలన నిబంధనలని పూర్తిగా విస్మరించారు అనేది కమిషన్ ఫైండింగ్ గా కనపడుతుంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ..!
