KCR Rule 2014-23: KCR పాలన విధ్వంసం కాదు-వికాసం..!
KCR Rule 2014-23: KCR పాలన విధ్వంసం కాదు-వికాసం..!

కాళేశ్వరం కూలేశ్వరంగా మారిపోయింది. కాళేశ్వరం తెలంగాణ పాలిట ఒక గుదిబండగా మారింది. కాళేశ్వరం కారణంగా తెలంగాణ అప్పుల పాలైంది. కాళేశ్వరం ఒక కుటుంబానికి ఆర్థిక వనరులు సమకూర్చడానికి మాత్రమే ఉద్దేశించబడింది. కాళేశ్వరం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి ఉపయోగం లేదు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరా కొత్తగా సాగు కాలేదు, కాళేశ్వరంతో ఒక గింజ అడిషనల్‌గా ఉత్పత్తి అయింది లేదు, పండింది లేదు, గడిచిన కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాళ్ళు మాట్లాడుతూ వస్తున్న మాట. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సందర్భంగా, పార్టీల మధ్య విధానపరమైన విమర్శలు ఉండొచ్చు కానీ, వాస్తవాలు ఏంటో తెలియకుండా, వాస్తవాలు ఏంటో కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, లేదా వాస్తవాలని మరుగున పరిచే ప్రయత్నంలో భాగంగా చేసే విమర్శలు, ఎక్కువ కాలం నిలబడవు, కాళేశ్వరం విషయంలో ప్రతిపక్షాలన్నీ లేకపోతే, రాజకీయ పార్టీలన్నీ, గత ప్రభుత్వంపై చేసిన విమర్శలన్నీ అబద్ధాలేనా, అంటే అవన్నీ అబద్ధాలేనని నిన్న కేంద్ర ఆర్థిక సర్వే తేల్చేసింది. నేను ఈ వీడియో చెప్పడం ఉద్దేశం గత ప్రభుత్వానికి సర్టిఫికెట్ ఇవ్వడం కాదు, గత ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వమైనా, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వమైనా, అంతకు ముందు ఉన్న ప్రభుత్వాలయినా, తెలంగాణ రాష్ట్రం యూనిట్ గా చూడాలి, రాష్ట్రానికి ఏం జరిగిందో చూడాలి, రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపైన పార్టీలు ఏం మాట్లాడుతున్నాయి అనేది చూడాలి, రాష్ట్రంలో జరుగుతున్న అంశం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పైన తప్పుడు ప్రచారం, రాష్ట్రానికి ఎప్పుడూ మంచిది కాదు, రాష్ట్రానికి మంచి జరిగేలా రాష్ట్రంలో పార్టీలు చేసిన తప్పుల్ని, ప్రభుత్వాలు చేస్తున్న తప్పుల్ని, విధానపరంగా వ్యతిరేకించాలి, తప్ప గుడ్డిగా బురద చల్లడం రాష్ట్రానికి మంచిది కాదు అని చెప్పడం నా ఉద్దేశం. దానిలో భాగంగా నిన్న కేంద్ర ఆర్థిక సర్వే చెప్పిన కొన్ని విషయాలని, మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను, ఏంటి ఆ కేంద్ర ఆర్థిక సర్వే చెప్పింది అంటే, కేంద్ర ఆర్థిక సర్వే చెప్పిన దాని ప్రకారం, స్వాతంత్రం వచ్చిన తర్వాత, 2014 వరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సాగు విస్తీర్ణంకోటి 31 లక్షల ఎకరాలు ఉంది, తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా 2014లో ఏర్పడే నాటికి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సాగు విస్తీర్ణం కోటి 31 లక్షల ఎకరాలు మాత్రమే, కానీ 2023 నాటికి అంటే తొమ్మిదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో, సాగు విస్తీర్ణం 2 కోట్ల 23 లక్షల ఎకరాలు, ఆల్మోస్ట్ డబుల్ కు పైగా తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ మాట రాజకీయ పార్టీ చెప్పిన మాట కాదు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, కేవలం భారతీయ జనతా పార్టీ చెప్పింది అని చూడడానికి కూడా అవకాశం లేదు, ఆర్థిక సర్వే ప్రతి ఏటా, కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, బడ్జెట్లు ప్రవేశపెట్టడాని కంటే ముందే, పార్లమెంట్లో నిన్న ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు, ఆర్థిక సర్వేలో ఉన్న అంశాలను బట్టి చూస్తే తెలంగాణ రైజింగ్ గా ఉంది, తెలంగాణ విధ్వంసం జరగలేదు, తెలంగాణలో అభివృద్ధి జరిగింది అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది, కేంద్ర ఆర్థిక సర్వే చూసిన తర్వాత, కేంద్ర ఆర్థిక సర్వే పొలిటికల్ మోటోతో, పొలిటికల్ మోటోతో పెట్టేది కాదు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అన్నారు, నేటికీ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అనేక ఏళ్లుగా, కాళేశ్వరం ఒక వృధా ప్రాజెక్ట్ అంటూ మాట్లాడుతూ వస్తున్నారు, వాళ్ళంతా కూడా ఆలోచన చేయాల్సింది, తెలంగాణ రాష్ట్రంలో కోటి 31 లక్షల ఎకరాల నుంచి, 2 కోట్ల 20 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరగడానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా అని ఆర్థిక సర్వే చెప్పింది, కాళేశ్వరం ప్రాజెక్టు అలాగే, మిషన్ కాకతీయ అలాగే, అదర్ మేజర్ అండ్ మైనర్ ఇరిగేషన్ యాక్టివిటీస్ కారణంగా, తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థాయిలో సాగు విస్తీర్ణం పెరిగింది అనే విషయాన్ని ఆర్థిక సర్వే చెప్తోంది. కాళేశ్వరంతో ఒక్క ఎకరాకి కూడా నీళ్లు ఇవ్వలేదు అని చెప్పిన మాట అబద్ధంని, ఆర్థిక సర్వే తేల్చింది కాళేశ్వరంతో ఒక్క కొత్త స్థాయికట్టు స్తిరీకరణ విషయం పక్కన పెట్టండి, కొత్తగా ఎక్కడా ఒక ఎకరా కూడా రాలేదు అని చెప్తున్న మాటలన్నీ అబద్ధం అని పార్లమెంట్ తేల్చేసింది. మిషన్ కాకతీయ కేవలం డబ్బుల కోసం పెట్టిన కార్యక్రమంగా విమర్శలు చేసే వాళ్ళందరికీ కూడా అది తప్పు అని కేంద్ర ఆర్థిక సర్వే చెప్పింది. 2014-23 వరకు తెలంగాణ ఎలా పురోగతి సాధించిందో అనేది సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


