Kutami Ministers calls To YCP Leaders: వైసీపీ ముఖ్యలకు కూటమి మంత్రులు ఫోన్స్? జగన్‌కు కొంచెం మా గురించి చెప్పండి ప్లీజ్..!
Kutami Ministers calls to YCP leaders: Coalition ministers call YCP leaders? Please tell Jagan a little about us..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి సంబంధించిన మంత్రులలో భయం కనబడుతోంది. ఆ భయం వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పైకి గాంభీర్యంగా ఉన్నప్పటికీ చాలా మంది మంత్రులు మౌనవ్రతం పాటిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ పైన విమర్శలు చేయడానికి, ప్రతిపక్ష పార్టీ పైన విమర్శలు చేస్తున్న ఒకరిద్దరు మంత్రులు కూడా లోలోపల ఆందోళన చెందుతున్నారు. ఆందోళన చెంది, ఆందోళన దాచుకోలేక, ఆందోళనతో వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులకు ఫోన్లు చేస్తున్నారు. అత్యంత విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం, అనేకమంది మంత్రులు వణికి పోతున్నారు. మళ్ళీ మనం అధికారంలోకి రాకపోతే మన పరిస్థితి ఏంటి అని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు దాదాపు ఆరు నెలలుగా జైల్లో ఉన్నారు. మరి కొంతమంది జైలుకు వెళ్లి వచ్చారు. ఇదే ఎక్స్పీరియన్స్ మనకి కూడా తప్పదు కదా, అనే భయం మంత్రులలో కనపడుతుంది. ఇటీవల మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశంలో టెండర్లు వేయడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం అనేది మంత్రుల్లో భయాన్ని మరింతగా పెంచుతోంది. ప్రభుత్వం కంటిన్యూస్ గా ఉంటుంది అనే నమ్మకం మంత్రులకు లేకుండా పోతుంది. 15 ఏళ్లు మేమే ఉంటామనే ప్రకటన పవన్ కళ్యాణ్, చంద్రబాబు పదే పదే చేస్తున్నప్పటికీ, 15 ఏళ్ళ మేము ఉంటామని బలంగా చెప్తున్నా, బిజినెస్ కమ్యూనిటీస్‌లో, ప్రజల్లో ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తుందనే ఇంప్రెషన్ పోతోంది. అనే విషయం మంత్రులకు అర్థమైపోతుంది. ఈ కారణంగానే అనేకమంది మంత్రులు వైసీపీకి సంబంధించిన నేతలకు టచ్ లోకి వెళ్తున్నారు. ఇది మాకేం సంబంధం లేదు, మేము మాట్లాడిన మాటలు కూడా మాకు సంబంధం లేదు, మేము చేస్తున్న పనులు కూడా మాకు సంబంధం లేదు, దయచేసి మా పైన వ్యక్తిగతంగా కక్ష పెట్టుకోకండి, మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయకండి అంటూ వైసీపీకి సంబంధించిన నేతలకు చెప్తున్నారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళండి ప్లీజ్ అని కూడా చెప్తున్నారు. గత సర్కార్లో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసింది ఒకరిద్దరు ఐఏఎస్ అధికారులని, ఐపిఎస్ అధికారులని, ప్రధానంగా అప్పుడు ఆయన ఏబి వెంకటేశ్వరావుని టార్గెట్ చేశారు. తర్వాత నిమ్మగడ్డ రమేష్ ని వేధించారు లాంటి ఇంప్రెషన్ ఉంది. వాళ్ళద్దరి తర్వాత అప్పుడు ఎంపీగా ఉన్నారు రఘురామకృష్ణం రాజు పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల బ్రెయిన్‌లో ఉంది. ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో వాళ్లకొక అనుభవం ఉంది. గతంలో టార్గెట్ చేస్తానని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఒకరిద్దరు వ్యక్తుల పట్ల వ్యవహరించిన తీరుపైన వాళ్లకి ఒక అవగాహన ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరుగా చెప్తున్నారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయాలు మార్చడం మాత్రమే కాదు, కారణమైన వాళ్ళ పైన చర్యలు తీసుకుంటాం. జైలుకు పంపిస్తాం, ఎక్కడున్నా వదలం అంటూ వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనం తీసుకున్న నిర్ణయాల కారణంగా మళ్ళీ మనం జైలుకి వెళ్ళాల్సి వచ్చినా, జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందేమో, మనం జైల్లో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందేమో, జగన్మోహన్ రెడ్డి అధికారానికి వస్తే కేవలం జైలుకి పంపించి తీసుకురావడం మాత్రమే కాదు, ఆయన స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, దాన్ని మనం తట్టుకోలేం అనే ఆందోళన కనిపిస్తుంది. అత్యంత విశ్వసనీయంగా, అత్యంత అథెంటిక్ గా చెప్తున్నాను, అరడజను మందికి పైగా మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులకు ఫోన్ చేసి ఈ మొత్తం జరుగుతున్న వ్యవహారాల్లో మా ప్రమేయం ఏమీ లేదు, ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కన్వే చేయండి, మమ్మల్ని టార్గెట్ చేయకండి అంటూ చెప్తున్న మాట నిజం. అలా చెప్పడానికి గత ప్రభుత్వంలోనూ, ఈ ప్రభుత్వంలోనూ వ్యాపారం చేస్తున్న, గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ కాంట్రాక్టులు పొందుతున్న కొంతమంది బిజినెస్ మెన్స్ ని కూడా వాడుకుంటున్నారు. వాళ్ళ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తున్నారు. సామాజిక కోణంలోనూ జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు ఈ సమాచారాన్ని చేరవేస్తున్నారు. మొత్తం క్యాబినెట్ లో ఉన్న మంత్రుల్లో సరిగ్గా ఐదు నుంచి ఆరు మంది కూడా జగన్మోహన్ రెడ్డి పైన గట్టిగా విమర్శలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!