Local Body Election : ఎన్నికలకు భయపడుతున్న అధికార పార్టీ..!
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల టెన్షన్ ఉన్నట్టు కనపడుతుంది.

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల టెన్షన్ ఉన్నట్టు కనపడుతుంది. ఎమ్మెల్యేలు ఫిరాయించిన నియోజక వర్గాలకు సంబంధించిన ఎన్నికలు వస్తే మన పరిస్థితి ఏంటనే ఆందోళన కాంగ్రెస్ పార్టీలో కనబడుతుంది. ఎమ్మెల్యేలు పార్టీ మారారు, 10 మంది బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రెబెల్ ఎమ్మెల్యేలకు కూడా గెలుస్తామనే నమ్మకం లేకుండా పోయింది. ఇలాంటి ఇంప్రెషన్ కలుగుతుంది ఎందుకంటే, ఆ ఎమ్మెల్యేలు మేము ఇంకా పార్టీ మారలేదు, మేము బిఆర్ఎస్ లోనే ఉన్నాం, మాపైన అనర్హత ఎలా వేస్తారు, ఇటువంటి మాటలు మాట్లాడడం, ఇటువంటి పిల్లి మొగ్గలు వేయడమే, వాళ్ళకు ఎన్నికలు అంటే ఎంత భయం ఉందో అనేది చెప్తోంది. నిజానికి పార్టీ మారిన ఎమ్మెల్యేలు అవును మేము పార్టీ మారాం, అభివృద్ధి కోసమే పార్టీ మారాం, అభివృద్ధి చేసుకోవడం కోసం పార్టీ మారాం, కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలు నచ్చి పార్టీ మారాం అనే భరోసా ఉంటే, ఎన్నికలకు సిద్ధంగా ఉండి ఉండాలి, రాజీనామా చేసి ప్రజల దగ్గరికి వెళ్లి, తాము తీసుకున్న నిర్ణయం సరైనదని నిరూపించుకునే ప్రయత్నం చేసి ఉండాలి. కానీ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత కారణమనో, లేకపోతే ఇంకో కారణమో, తెలియదు కానీ ఎన్నికలకు వెళ్ళడానికి పార్టీ మారిన ఎమ్మెల్యేలు భయపడుతున్నారు, వాళ్ళ చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళే ధైర్యం కాంగ్రెస్ పార్టీ సర్కార్ కూడా ఉన్నట్టు కనిపించట్లేదు, తెలంగాణలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది.
యూరియా పంపిణి అంశానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో యూరియా అంశం రేవంత్ సర్కార్‌ను డీఫేమ్ చేస్తూ వస్తుంది, బయటికవచ్చి రోజు ప్రతిరోజు రోడ్లెక్కి రైతులంతా ఆందోళన చేయకపోవచ్చు, కానీ యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయింది, ఇలాంటి ఇంప్రెషన్ మాత్రం చాలా బలంగా గ్రామీణ ప్రాంతాల్లోకి చేరింది. దానికి కారణం బిఆర్ఎస్ పార్టీనా ,దానికి కారణం భారతీయ జనతా పార్టీనా, కేంద్రం నుంచి రాలేదా, అక్కడి నుంచి ఇవ్వలేదా, ఇవన్నీ పక్కన పెడితే నష్టం మాత్రం డెఫినెట్ గా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం తరహా వాతావరణం గ్రామీణ ప్రాంతాల్లో కనబడుతుంది. యూరియా అంశానికి సంబంధించి, ఇక రుణమాఫీ అంశానికి సంబంధించి కూడా రెండు లక్షల పైన రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు దిక్కు లేకుండా పోయిందని, అనేక చోట్ల లక్షకు లోపు కూడా మాకు రుణమాఫీ కాలేదు అని చెప్తున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంది, కారణాలు ఏమైనా కావచ్చు, టెక్నికల్ రీజన్ కావచ్చు, ఇంకేదైనా రీజన్ కావచ్చు, కొంత టైం ఇస్తున్నాం 2 లక్షల పైన లోన్ ఉన్నవాళ్ళు మీరు రెండు లక్షల పైన ఎంత ఉందో అంత కట్టేసేయండి, ఆ తర్వాత 2 లక్షలు మాఫీ అవుతుంది అంటూ సర్కారు చెప్పింది. సర్కారు చెప్పి ఏడాది గడిచిపోయింది కానీ ఇప్పటికీ కూడా అది పూర్తి కాని పరిస్థితి ఉంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
