ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ ఎన్నికల్లో గెలవడానికి సంబంధించి ప్రయత్నం చేయడం, గెలవడానికి సంబంధించి సర్వశక్తులు ఓడడం

ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ ఎన్నికల్లో గెలవడానికి సంబంధించి ప్రయత్నం చేయడం, గెలవడానికి సంబంధించి సర్వశక్తులు ఓడడం, గెలవడానికి సంబంధించి ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజలను అభ్యర్థించడం, ప్రజలకు తాము గెలిస్తే ఏం చేస్తాఅనేది చెప్పడం, ఇవి కామన్ గా చూస్తుంటాం. తమ ఎన్నికల్లో తాము గెలవడం కోసం అభ్యర్థులు క్యాంపెయిన్ చేయడం చూస్తున్నాం. అభ్యర్థులు వింత వింతగా వెరైటీగా క్యాంపెయిన్లు చేయడం చూస్తున్నాం, డబ్బులు ప్రవహించేలా చేయడం చూస్తున్నాం, మద్యం ప్రవహించేలా చేయడం చూస్తున్నాం, ఇటీవల భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ కూడా మేనేజ్ చేస్తుంది ఇలాంటి వార్తలు కూడా వింటున్నాం. వీటన్నిటిని నడుమ భారతీయ జనతా పార్టీ మాత్రమే, భారతీయ జనతా పార్టీ, ఈ దేశంలో కొత్తగా తీసుకొచ్చిన సిస్టం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ విజయం కోసం, భారతీయ జనతా పార్టీ ప్రత్యర్ది పార్టీలు కూడా పనిచేయడం, ఇది వినడానికి కాస్త కొత్తగా ఉన్నా ఇది నిజం. మీకు అందరికీ తెలిసిందే ఏంటి ఆ నిజం భారతీయ జనతా పార్టీ ఓట్లు, భారతీయ జనతా పార్టీకి ఎలాగో ఓట్లు వేయని వాళ్ళు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసేవాళ్ళు, అందరూ ఒక దగ్గర ఓటు వేయకూడదు. వాళ్ళ ఓట్లలో చీలిక తీసుకురావాలి, ఒకటి భారతీయ జనతా పార్టీ ఐడియాలజీతో, ఐడియాలజీతో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసేవాళ్ళు, భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే వాళ్ళు మాత్రం ఒక్క చోట ఓటు వేయకూడదు, నాలుగైదు చోట్ల ఓటు వేయాలి, అప్పుడు ఆ ఓట్ల చీలిక కారణంగా భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది.
ఈ సింపుల్ సూత్రాన్ని భారతీయ జనతా పార్టీ గత కొద్ది రోజులుగా అనేక ఎన్నికల్లో వాడుతూ వచ్చింది. దేశవ్యాప్తంగా, తాజాగా బీహార్ లోనూ వాడుతూ వస్తుంది. బీహార్ లో, గతంలో ఉత్తరప్రదేశ్ లో, గతంలో పంజాబ్ లో, గతంలో గుజరాత్‌లో, హిమాచల్ ప్రదేశ్ లో, ఢిల్లీలో ఇలా అనేక రాష్ట్రాల్లో ఈ ఫార్ములాని భారతీయ జనతా పార్టీ అమలు చేస్తూ వచ్చింది. ఈ ఫార్ములా అమలు చేయడానికి కావాల్సింది ఏంటి, భారతీయ జనతా పార్టీకి తమ ప్రత్యర్ధి పార్టీలలో కూడా తమకు మిత్రులు ఉండడం, తమ ప్రత్యర్ది పార్టీలో కూడా తమ మిత్రులు ఎవరు అంటే, తమ ప్రత్యర్ది పార్టీలో కూడా కొంతమందిని మిత్రులుగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అటువంటి భారతీయ జనతా పార్టీ కొత్త మిత్రులని మెయింటైన్ చేయడం మాత్రమే కాదు, కొత్త పార్టీలని కూడా పుట్టిస్తుంది, కొత్త పార్టీలని కూడా సృష్టిస్తుంది, చాలా చాలా సందర్భాల్లో చూశాం. గతంలో ములాయం ఫ్యామిలీలో గొడవలు పెట్టి, కొత్త పార్టీని తెరపైకి తీసుకురావడం కావచ్చు, గుజరాత్‌లో అటువంటి ప్రయత్నాలు చేయడం కావచ్చు, వెస్ట్ బెంగాల్ లో అటువంటి ప్రయత్నాలు చేయడం కావచ్చు, బీహార్‌లో తాజాగా అటువంటి ప్రయత్నాలు చేయడం కావచ్చు. ఏంటి భారతీయ జనతా పార్టీ చేస్తోంది, భారతీయ జనతా పార్టీ విజయం కోసం బీహార్‌లో ఎంఐఎం పార్టీ రంగంలోకి దిగింది, మళ్ళీ చెప్తున్నా భారతీయ జనతా పార్టీ విజయం కోసం బీహార్‌లో ఎంఐఎం పార్టీ రంగంలోకి దిగింది. ఇది నిజం. గడిచిన బీహార్ ఎన్నికల సందర్భంగా కూడా భారతీయ జనతా పార్టీ విజయం వెనక, అక్కడ మహా కూటమి ఓటమి వెనక ఎంఐఎం పార్టీ ఉంది. సెక్యులర్ ఓట్లను చీల్చడమే లక్ష్యంగా ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుంది. ఎంఐఎం పార్టీ ఒక పొలిటికల్ పార్టీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎంఐఎం పార్టీ పోటీ చేయకుండా ఎట్లా తప్పుపడతాం అంటే ఎంఐఎం పార్టీ నిత్యం ఈ దేశంలో సెక్యులరిజం గురించి మాట్లాడుతుంది. ఈ దేశంలో మోడీ మతతత్వం గురించి మాట్లాడుతుంది. మోడీ సర్కార్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతుంది. అటువంటప్పుడు మిగతా భావసారూప్య పార్టీలన్నీ కలిసి పని చేస్తున్నప్పుడు కూడా వాళ్ళతో ఎందుకు కలిసి పని చేయలేకపోతుంది.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
