Balkrishna Fans vs Chiranjeevi Fans: రగులుతున్న బాలకృష్ణ, చిరంజీవి క్యాంపులు.. సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!

Balkrishna Fans vs Chiranjeevi Fans: రగులుతున్న బాలకృష్ణ, చిరంజీవి క్యాంపులు.. సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!

By :  ehatv
Update: 2025-09-30 11:26 GMT

అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలా తీవ్రమైన చర్చ చూస్తున్నాం. బాలకృష్ణ వ్యాఖ్యల తర్వాత ఇమీడియట్ గా పొలిటికల్ స్టేట్మెంట్స్, పొలిటికల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా, బాలకృష్ణని టార్గెట్ చేయడం, బాలకృష్ణ టార్గెట్ గా మాట్లాడం ఇవన్నీ చూశాం. ఇవన్నీ చూసిన తర్వాత కామినేని శ్రీనివాసరావు అసెంబ్లీ వేదికగా, నేను అనవసరంగా ఈ ప్రస్తావన తీసుకొచ్చాను, ఈ ప్రస్తావనం తీసుకురావడం సరైనది కాదు అనిపించింది, కాబట్టి నా వ్యాఖ్యలని రికార్డుల నుంచి తొలగించండి అంటూ, ఆయన చెప్పిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలని రికార్డుల నుంచి తొలగించారు. వివాదాన్ని ఆ రకంగా ముగించామని ప్రభుత్వం అనుకుంటుంది. ఆ రకంగా ముగించామని ప్రభుత్వం చెప్పదలుచుకుంటుంది, కానీ బాలకృష్ణ అన్న వ్యాఖ్యల్ని అసెంబ్లీ రికార్డుల నుంచి ఇంకా తొలగించలేదు, బాలకృష్ణ తనకు తానుగా నా వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించండి అని చెప్పలేదు, ఆయన వ్యాఖ్యలని తొలగించడానికి సంబంధించి, స్పీకర్ ఇనిషియేట్ చేసినట్టుగా కూడా కనపడలేదు, మరి ఆయన వ్యాఖ్యలు అలాగే ఉంటే, ఎలా అనేది ప్రస్తుతం చిరంజీవి అభిమానుల్లోనూ, వైస్రార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లోనూ, ఈవెన్ జనసేనకు సంబంధించిన నాయకుల్లోనూ, ఉత్పన్నం అవుతున్న ప్రశ్న. చిరంజీవి గురించి తప్పుగా మాట్లాడింది బాలకృష్ణ అయితే, కామినేని శ్రీనివాసరావు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు కాబట్టి, వివాదం సద్దుమణిగినట్టు ఎట్లా అవుతుంది అనేది ఒక ప్రశ్న అయితే, బాలకృష్ణ వ్యాఖ్యల తర్వాత, చిరంజీవి లేఖ రిలీజ్ చేయడాన్ని, బాలకృష్ణ శిబిరం తట్టుకోలేకపోతుంది. మనకున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం, బాలకృష్ణ కూడా ఓ లేఖ లేఖ రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారు, చిరంజీవి లేఖకు కౌంటర్ గా బాలకృష్ణ ఒక లేఖ రాస్తారు, లేఖ రాయబోతున్నారు అంటూ, సినిమా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఉట్టి ప్రచారం కాదు, ప్రచారంలో నిజం కూడా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలు, ముఖ్యులు బాలకృష్ణ ఆ లేఖ రిలీజ్ చేయకుండా ఆపారు, ఆపే ప్రయత్నం చేసిన సందర్భంగా బాలకృష్ణ వాళ్ళకి, గ్యారెంటీగా లేఖ రిలీజ్ చేయను అనే గ్యారెంటీ ఇవ్వలేదు కాబట్టి, ఆయన లేఖ రిలీజ్ చేస్తారేమో, మనం సైలెంట్ గా వదిలేస్తే ఎలా అంటూ, చిరంజీవి శిబిరం కూడా మేలుకొంది. దానిలో భాగంగానే హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ హోటల్లో భారీగా చిరంజీవి అభిమానులు సమావేశం నిర్వహించారు. సమావేశం నిర్వహించి, బాలకృష్ణ గనుక అటువంటి లేఖ రిలీజ్ చేస్తే, ఇమ్మీడియట్ గా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లోనూ కేసులు పెట్టాలి, బాలకృష్ణ పైన అని నిర్ణయం తీసుకున్నారు. నిన్న సమావేశమైన చిరంజీవి అభిమానులు, చిరంజీవికి తెలియకుండా సమావేశం అయ్యారని చెప్తే ఏ ఒక్కరు నమ్మే పరిస్థితి లేదు. చిరంజీవి నాలెడ్జ్ లో ఉంది. చిరంజీవికి తెలిసి వాళ్ళంతా సమావేశం అయ్యారు.ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..

Full View

Tags:    

Similar News