Nara Lokesh : జగన్ కు లోకేష్ సవాల్..కానీ అలా ఎలా..
రాజకీయ పార్టీల నాయకులు ఒకరికొకరు సవాళ్లు చేసుకోవడం కొత్తేం కాదు, దేశంలో చాలా సందర్భాల్లో చాలా సవాళ్లు చూస్తున్నాం.

రాజకీయ పార్టీల నాయకులు ఒకరికొకరు సవాళ్లు చేసుకోవడం కొత్తేం కాదు, దేశంలో చాలా సందర్భాల్లో చాలా సవాళ్లు చూస్తున్నాం. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక సవాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి జోగి రమేష్ కల్తీ మద్యం తయారు చేయించారు. కల్తీ మద్యం రాకెట్ వెనక జోగి రమేష్ ఉన్నారు అంటూ ఆయన ఆరోపించారు.
జోగి రమేష్ అరెస్ట్ అనేది ఆయన తప్పు చేశాడు కాబట్టి జరిగింది, తప్ప బీసీ కాబట్టి జరిగిన అరెస్ట్ కాదు అంటూ నారా లోకేష్ చెప్తున్నారు. ఓకే ఫైన్ ఒప్పుకుందాం. నారా లోకేష్ ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైన, జగన్మోహన్ రెడ్డిపైన విమర్శలు చేస్తూ, తనకు మద్యంతో, కల్తి మద్యంతో సంబంధం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. కల్తీ మద్యం నిధులు ఒక రూపాయి కూడా నాకు చేరలేదు, కల్తీ మద్యం డబ్బులు నేను తీసుకోలేదు అంటూ నేను ఎక్కడ ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేస్తా, మద్యం వ్యవహారంలో తాను డబ్బులు తీసుకోలేదని జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేయగలరా అంటూ, ఆయన సవాల్ చేశారు. ఏ దేవుడి దగ్గరికైనా వచ్చి జగన్మోహన్ రెడ్డి సవాల్ చేయగలరా అంటూ, ప్రమాణం చేయగలరా అంటూ సవాల్ చేశారు.
నారా లోకేష్ గతంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ, జనసేన అన్ని పార్టీలు తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి గత ప్రభుత్వంలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని లడ్డూల తయారీలో వాడారు అంటూ ఆరోపణ చేసిన నేపథ్యంలో, అప్పుడు టిటీడి మా చైర్మన్‌గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి, తిరుమల శ్రీవారి అఖిలాండం దగ్గరికి వచ్చి నేను ప్రమాణం చేస్తాను, మీరు ఎవరైనా వచ్చి ప్రమాణం చేస్తారా అంటే ఎవ్వరు ఆ ప్రయత్నం చేయలేదు. ఎందుకో అనేక సందర్భాల్లో వైసార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వైపు నుంచి ప్రమాణాలు చేస్తారా అంటే, ప్రమాణాలకి అధికార పార్టీ వైపు నుంచి ముందుకు రాలేదు.
తాజాగా అరెస్ట్ అయిన జోగి రమేష్ అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్లి అక్కడ అగ్నిసాక్షిగా, కుటుంబ సమేతంగా ఈ వ్యవహారంతో నాకు సంబంధం లేదు, ఈ వ్యవహారంలో నేను ఒక రూపాయి తీసుకోలేదు, ఆ రాకెట్ వెనుక నేను లేను అంటూ ప్రమాణం చేశారు. ఆ ప్రమాణాన్ని ప్రభుత్వం నమ్ముతుందా, ఆ ప్రమాణాన్ని నమ్మి కేసు నుంచి వదిలేస్తుందా, ఈ ప్రమాణాలు అనేది దేనికి ప్రతీక, ప్రమాణాలు చేసుకుంటే ఇక విచారణలు అవసరం లేదా, ఒకరి పైన ఒకరు సవాలు చేసుకొని ప్రమాణాలు చేసుకుంటే, సమస్యలు పరిష్కారం అయిపోయి కేసులు పెట్టుకునే అవసరం ఉండదా, నారా లోకేష్ తేల్చాల్సింది ఏ రకంగా సంబంధం ఉంది. అనే దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కానీ, సవాళ్ల వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళు సవాలు చేసినప్పుడు మీరు రారు, మీరు సవాలు చేసినప్పుడు వాళ్ళు రారు, చాలా సందర్భాల్లో వాళ్ళ సవాళ్లను స్వీకరించే పరిస్థితిలోకి మీరు లేరు, అనేక సందర్భాల్లో మీ సవాల్‌ను స్వీకరించే పరిస్థితిలో వాళ్ళు లేరు, ఇది పొలిటికల్ గా పేపర్లో ఒక వార్తకు పనికొస్తుంది తప్ప ఒక్క రూపాయి కూడా పనికొచ్చేది కాదు. సవాళ్లు-ప్రతిసవాళ్లపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' ఎనాలసిస్..!


