Sujana Chowdary: సుజనా చౌదరి సంచలనం..!
Sujana Chowdary: సుజనా చౌదరి సంచలనం..!
అమరావతి రైతులు కష్టాల్లో ఉన్నారు, అమరావతి రైతులు గడిచిన ఐదేళ్లు ఉద్యమం చేశారు, ఉద్యమం తర్వాత కూటమి సర్కార్ వచ్చింది. అమరావతి అభివృద్ధి చెందబోతుంది, అమరావతి నగర నిర్మాణం వాస్తవ రూపం దాల్చబోతుంది అని భావించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల పోరాటానికి, మాలాంటి వాళ్ళంతా, మాలాంటి వాళ్ళంతా నైతికంగా మద్దతు తెలుపుతూ వచ్చాం. గత ప్రభుత్వం అమరావతి రైతులపైన కేసులు పెట్టడాన్ని వ్యతిరేకించాం. అమరావతి ఉద్యమం సందర్భంగా మహిళల పైన పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపట్టాం. మహిళలు వెళ్లి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం కూడా లేకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని తప్పుపట్టాం. ఆ సమయంలో అమరావతి జేఎసీ చేసిన పాదయాత్రకు మద్దతు తెలిపాము. నైతికంగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కలలు సహకారం అవుతాయి అనుకున్నాం. వాళ్ళ కష్టాలు తీరుతాయి అనుకున్నాం. నగర నిర్మాణం వాస్తవ రూపం దాల్చుతుంది అనుకున్నాం. నగరాన్ని నిర్మించడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, జస్ట్ రోడ్లు వేసినా మా ప్లాట్లు విలువలు వస్తాయి, విలువ వస్తుంది అంటూ గడిచిన ఐదేళ్ళు అక్కడ రైతులు మాట్లాడుతూ వచ్చారు. మీరు నగరాన్ని కట్టకండి, కనీసం రోడ్లు వేయండి, ఉన్నదాన్ని పాడు చేయకండి అంటూ కోరుతూ వచ్చారు. సో ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 30 వేల కోట్లు 40 వేల కోట్లు టెండర్లు పిలిచాం అని చెప్పి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచిన తర్వాత కూడా, ఈరోజు ఏ ఒక్క అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతు కూడా ధైర్యంగా ఇక్కడ రాజధాని నిర్మాణం పూర్తవుతుంది. మన ప్లాట్లకు రేట్లు వస్తాయి, మనం చేసిన పోరాటం ఫలించింది అని భావిస్తున్నాడా, లేదా ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి, ఓ పక్క వాళ్ళ ఆందోళన అలా ఉండగా, మళ్ళీ అదనపు భూసేకరణ పేరుతో, వాళ్ళ గుండెల్లో గుబ్బులు పుట్టించారు. ఆందోళన రేకెత్తించింది. ప్రభుత్వం ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టిన, రేపో మాపో అదనపు భూసేకరణ చేయబోతుంది. ప్రభుత్వం కచ్చితంగా పట్టాలు ఇచ్చారు, భూమిని అదే అని చూపించారు, దానికి పోవడానికి దారి లేదు, అది డెవలప్ చేస్తారో లేదో తెలియదు, ఎప్పుడు డెవలప్ చేస్తారో లేదో తెలీదు, దాన్ని తీసిపోయి బ్యాంకులో పెడితే ఎవడు బ్యాంకులో లోన్లు ఇవ్వట్లేదు, భూములు ఇచ్చిన రైతులకు మీ ప్రభుత్వం వచ్చిన 15 నెలల తర్వాత కూడా వాళ్ళ కష్టం తీరింది లాంటి ఒక ఇంప్రెషన్ లేదు.
ఓ భరోసా లేదు, ఇప్పుడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చి మాట్లాడితే ఎట్లా పైగా, మనం గతం ముఖ్యమంత్రిని తిట్టి తిట్టి తిట్టి తిట్టి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, వీళ్ళ ప్రయారిటీస్ వేరే కనపడుతున్నాయి, వీళ్ళతో మనం మాట్లాడే పరిస్థితి లేదు, స్టేక్ హోల్డర్స్ గా కనీసం మనల్ని పిలిచి మందలించే పరిస్థితి లేదు, మొత్తం అంతా నారాయణ చుట్టూ పెట్టారు, నారాయణ నారాయణ మంత్రం అయిపోయింది.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!